తీహార్ జైలులో ఖైదీల నిరాహారదీక్ష
Published Fri, Feb 14 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
న్యూఢిల్లీ: తీహార్ జైలులో 50 మందికి పైగా ఖైదీలు బుధవారం నిరాహార దీక్షకు దిగారు. ఖైదీలను వారి సంబంధీకులు వారానికి ఒకసారే కలిసే వీలు కల్పిస్తూ తీహార్ జైలు డెరైక్టర్ జనరల్ విమలా మెహ్రా గత నెల 28న ఒక ఉత్తర్వు జారీ చేశారు. అత్యంత కట్టుదిట్ట భద్రత వార్డులో ఉన్న ఖైదీలు ఇంతకుముందు వారానికి రెండు సార్లు తమ కుటుంబ సభ్యులతో కలిసేవారు. అయితే కొత్త నిబంధన ప్రకారం వారు వారానికి ఒకసారి మాత్రమే తమ కుటుంబసభ్యులతో మాట్లాడే వీలుంటుంది. అదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారానే.. ఒకసారి ఐదుగురు కుటుంబసభ్యులనే అనుమతి స్తారు. దీనిపై ఖైదీలు నిరసన వ్యక్తం చేస్తూ ఇప్పటికే జైలు ఉన్నతాధికారులకు, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, జిల్లా జడ్జికి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ జనరల్ నజీబ్ జంగ్ తదితరులకు లేఖలు రాశారు. అలాగే తమను కలవడానికి 15 మంది కుటుంబసభ్యులను అనుమతించాలని ఆ లేఖలో కోరారు. తమ డిమాండ్లు తీర్చేవరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామన్నారు.
Advertisement
Advertisement