సాక్షి, బెంగళూరు : ఉప ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. దీంతో విజయంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. శికారిపుర, బళ్లారి రూరల్, చిక్కొడి-సదలగ నియోజక వర్గాలకు ఈ నెల 21న ఉపఎన్నికలు జరిగిన వైనం విదితమే. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
మధ్యాహ్నం 12 గంటల్లోపు ఫలితాలు వెల్లడి కానున్నాయి. శికారిపుర నియోజకవర్గం ఓట్ల లెక్కింపును శివమొగ్గలోని సహ్యాద్రి కళాశాలలో చేపట్టనున్నారు. చిక్కొడి - సదలన నియోజకవర్గం ఓట్ల లెక్కింపును చిక్కొడి లోని ఆర్.డి.కళాశాలలో, బళ్లారి గ్రామీణ నియోజకవర్గం ఓట్లను బళ్లారిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించనున్నారు.
నేడు ఉప ఫలితాలు
Published Mon, Aug 25 2014 3:25 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM
Advertisement
Advertisement