మరణించినా.. చిరంజీవులే
కర్ణాటకలో ఇద్దరి అవయవదానం
సాక్షి, బెంగళూరు:అవయవ దానం చేసి మరణానంతరం కూడా చిరంజీవులుగా మిగిలారు మంగళూరుకు చెందిన వినీత్ రాజ్(19), హాసన్‌కు చెందిన సంజనా(18). ప్రమాదాల్లో గాయపడిన వీరు అవయవదానం ద్వారా మరో ఎనిమిది మందికి జీవం పోయగలిగారు. వివరాలు...... మంగళూరులోని మంజేశ్వర ప్రాంతానికి చెందిన కృష్ణమూల్య, గీతా దంపతుల కుమారుడు వినీత్ రాజ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు.
ఈక్రమంలో సోమవారం ఓ బిల్డింగ్‌పై వైరింగ్ పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై కిందికి పడిపోయారు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఎస్.జె.ఆస్పత్రికి తరలించగా బ్రెయిన్‌డెడ్ అయినట్లుగా వైద్యులు బుధవారం ప్రకటించారు. తమ బిడ్డ లేకపోయినా అతని అవయవాలు మరొకరికి ఉపయోగపడాలని భావించి అవయవదానానికి అంగీకరించారు. దీంతో బెంగళూరుకు చెందిన వైద్యుల బృందం ఎస్.జె.ఆస్పత్రికి చేరుకొని కాలేయం, కిడ్నీలు, కళ్లను సేకరించారు. ఈ అవయవాలను ప్రత్యేక విమానంలో గురువారం బెంగళూరుకు తీసుకొచ్చారు.
మరో ఘటనలో.....
హాసన్‌కు చెందిన సంజనా ఇంజనీరింగ్ విద్యనుఅభ్యసిస్తోంది. ఈనెల 21న మైసూరులోని కేఆర్‌ఎస్‌ను సందర్శించేందుకు కుటుంబ సభ్యులతో వెళ్లింది. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురవ్వగా హాసన్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజుల పాటు చికిత్స అందించిన హాసన్ వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంజనా తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించడంతో ఆమెను గురువారం బెంగళూరులోని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రికి త రలించారు. ఆస్పత్రి చీఫ్ న్యూరో సర్జన్ డాక్టర్ ఎన్.కె.వెంకటరామణ్ణ నేతృత్వంలోని వైద్యులృబందం సంజనా నుంచి ఆమె ృదయం, కాలేయం, కిడ్నీలు, కళ్లను సేకరించారు.