హోదాపై దిష్టిబొమ్మల దహనం
Published Thu, Sep 8 2016 6:50 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
విజయవాడ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ విజయవాడలో కాంగ్రెస్ నేతలు గురువారం రెండు ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈ సందర్భంగా మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ...ఏపీ అభివృద్ధికి ప్యాకేజి ఏవిధంగా ఉపయోగపడదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ద్వారానే పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్, పెట్రోకారిడర్ అంశాలు పర్యవేక్షిస్తున్నామని కేంద్రమంత్రి సురేష్ ప్రభు చెప్పటం దారుణమన్నారు.
ప్రధాని మోదీ రాజధానికి మట్టి, నీరు ఇస్తే...ఆర్ధిక మంత్రి జైట్లీ మాయమాటలు చెప్పారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజల హక్కుల్ని కాలరాస్తుంటే టీడీపీ సర్కార్ కళ్లు అప్పగించి చూస్తోందని విష్ణు అన్నారు. మరోనేత కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ...ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తుందన్నారు. విభజన చట్టాలకు సీఎం చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Advertisement