ఏపీని నమ్మించి మోసం చేసిన కేంద్రం | congress leaders slams over central govt over special status | Sakshi
Sakshi News home page

ఏపీని నమ్మించి మోసం చేసిన కేంద్రం

Published Tue, Sep 20 2016 11:05 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఏపీని నమ్మించి మోసం చేసిన కేంద్రం - Sakshi

ఏపీని నమ్మించి మోసం చేసిన కేంద్రం

ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ కార్యదర్శి మానస్‌ మల్లిక్‌
ఒంగోలు : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నమ్మించి మోసం చేసిందని ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ కార్యదర్శి మానస్‌మల్లిక్‌ విమర్శించారు. సోమవారం జిల్లాకు వచ్చిన ఆయన స్థానిక జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడారు. సభకు యువజన కాంగ్రె స్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ గుర్రాల రాజ్‌విమల్‌ అధ్యక్షత వహించారు. 
 
మానస్‌ మల్లిక్‌ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఏపీ కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి.. నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన మాట ను నిలబెట్టుకోకుండా భారీ ప్యాకేజీ ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడం దారుణమన్నారు. యువజన కాంగ్రెస్‌ నూతన అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ రాజ్‌విమల్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పదవికి వన్నే తేవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ నాయకులు రాజ్‌విమల్‌ను అభింనందించారు.

తొలుత రాజ్‌విమల్‌ గృహం నుంచి ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రకాశం భవనం సమీపంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహనికి, బాబూ జగజ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి అట్లూరి విజయ్, నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు ఎద్దు శశికాంత్‌ భూషణ్, వేమా శ్రీనివాసరావు, షేక్‌ సైదా, మైనారిటీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గఫూర్, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాదాల రాజశేఖర్, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం తదితరులు పాల్గొన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement