విజయం సాధించేది విశాల్ జట్టే | Vishal win in Nadigar Sangam Election | Sakshi
Sakshi News home page

విజయం సాధించేది విశాల్ జట్టే

Published Mon, Aug 3 2015 2:42 AM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

విజయం సాధించేది విశాల్ జట్టే

విజయం సాధించేది విశాల్ జట్టే

తమిళసినిమా: నడిగర్ సంఘం ఎన్నికల్లో విజయం సాధించేది విశాల్ జట్టేనని నటుడు కరుణాస్ వ్యాఖ్యానించారు.ఆదివారం కయంబత్తూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 30 ఏళ్లుగా రంగస్థల నటీనటులను సినిమా రంగం ఉపయోగించుకుంటుందన్నారు. అయితే వారి ఎలాంటి అవసరాలనూ సంఘం తీర్చలేదని ఆరోపించారు. ఇక నడిగర్ సంఘంలో పెద్దకుంభకోణం జరిగిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో విశాల్ జట్టు విజయం సాధిస్తుంది. ఆ తరువాత ఆయన సంఘ సభ్యుల అవసరాలన్నీ పూర్తి చేస్తారని అన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని మదురై, దిండుక్కల్, మణపారై, కారైకుడి, పుదుకోట్టై ప్రాంతాలు తిరిగి రంగస్థల నటులను కోరామన్నారు. అప్పుడు వాళ్లు సంఘం గురించి పలు ఫిర్యాదులు చేశారన్నారు. పుదుకోట్టైకు చెందిన దేవి అనే రంగస్థల కళాకారిణి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటే ఆర్థికసాయం అందించామన్నారు. నడిగర్‌సంఘం సభ్యులకు మాత్రమే సాయపడాలని కరుణాస్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement