Nadigar Sangam Election
-
విశాల్‌పై రాధిక ఫైర్
నడిగర్ ఎన్నికలు ఈ సారి మరింత రసవత్తరంగా మారుతున్నాయి. మరోసారి గెలిచి సత్తా చాటాలని విశాల్ సారధ్యంలోని పాండవర్ టీం ప్రయత్నిస్తుంది. అయితే ఈ సారి విశాల్ టీంకు వ్యతిరేకంగా భాగ్యరాజ్ బరిలో దిగటంతో పోటి ఆసక్తికరంగా మారంది. ప్రచారంలో భాగంగా విశాల్ ఇటీవల విడుదల చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. గత కమిటీలపై దుమ్మెత్తిపోస్తూ గత ఎన్నికలలో కొందరు శరత్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యల వీడియోలను ట్వీట్లుగా యూట్యూబ్ ద్వారా మళ్లీ తెరపైకి తెచ్చాడు విశాల్. అయితే ఈ వీడియోలపై శరత్ కుమార్ భార్య సీనియర్ నటి రాధిక, కుమార్తె వరలక్ష్మిలు తీవ్రస్థాయిలో చిరుచుకు పడుచున్నారు. ఇప్పటికే విశాల్‌కు ట్విటర్ ద్వారా బహిరంగ లేఖ రాసిన వరలక్ష్మీ శరత్‌కుమార్ నా ఓటును కోల్పోయావ్ అంటూ ట్వీట్ చేశారు. గతంలో ఫ్రెండ్‌గా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ బయటపెట్టడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై సీనియర్ నటి, శరత్‌కుమార్ సతీమణి రాధిక స్పందించారు. నిజంగా శరత్ కుమార్ తప్పు చేసుంటే న్యాయస్థానం తేల్చుతుందని, న్యాయస్థానంలో ఉన్న కేసుపై విశాల్ వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం అని ఆమె మండిపడ్డారు. అంతేకాదు.. నిజంగానే విశాల్ టీమ్ ఈ రెండేళ్ళలో అభివృద్ది చేసుంటే వాటిని చూపించి ఓట్లు అడగాలి, కాని పాత విషయాలు, న్యాయస్థానంలో ఉన్న విషయాలను విశాల్ మాట్లాడుతున్నారంటే ఆయనకు నడిగర్ సంఘానికి చేసింది ఏమిలేదని అర్థం అవుతుందన్నారు. ఇదే ఇప్పుడు విశాల్ కు ఇబ్బందులు తెచ్చిపడుతుంది. 23న నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్న వేళ రాధిక, వరలక్ష్మిలతోపాటు మరికొందరు సీనియర్ల విమర్శలు దక్షిణాది సినిమా నటీనటుల సంఘంలో చర్చనీయాంశంగా మారింది. -
హీరో విశాల్ పై దాడి
చెన్నై : హీరో విశాల్‌పై ప్రముఖ నటుడు శరత్‌కుమార్ వర్గీయులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో విశాల్ ఎడమ చేతికి గాయమైంది. వెంటనే సన్నిహితులు ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే నడిగర్ సంఘం ఎన్నికల్లో ఓటమి భయంతోనే తనపై దాడికి పాల్పడుతున్నారని విశాల్ ఆరోపించారు. నడిగర్ సంఘం ఎన్నికలు ఆదివారం ఆళ్వార్‌పేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత పదేళ్లుగా నడిగర్ సంఘానికి ప్రముఖ నటుడు శరత్‌కుమార్ బృందం కార్య నిర్వాహకవర్గంగా కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది కూడా ఆ బృందమే పదవీ బాధ్యతలు కొనసాగాలని భావించింది. అయితే ప్రముఖ నటుడు విశాల్ బృందం జట్టు కూడా ఈ సంఘం బాధ్యతలు చేపట్టేందుకు ఉత్సాహాన్ని చూపింది. దీంతో ఈ సంఘానికి ఎన్నికలు అనివార్యమైంది. అంతేకాకుండా అటు శరత్‌కుమార్ జట్టు... ఇటు విశాల్ జట్ల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నాయి. చివరికి ఈ రెండు జట్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ఆళ్వార్ పేట పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ రోజు సాయంత్రం ప్రకటించనున్నారు. -
రసవత్తరంగా మారిన చెన్నై నడిగర్ ఎన్నికలు
-
విజయం సాధించేది విశాల్ జట్టే
తమిళసినిమా: నడిగర్ సంఘం ఎన్నికల్లో విజయం సాధించేది విశాల్ జట్టేనని నటుడు కరుణాస్ వ్యాఖ్యానించారు.ఆదివారం కయంబత్తూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 30 ఏళ్లుగా రంగస్థల నటీనటులను సినిమా రంగం ఉపయోగించుకుంటుందన్నారు. అయితే వారి ఎలాంటి అవసరాలనూ సంఘం తీర్చలేదని ఆరోపించారు. ఇక నడిగర్ సంఘంలో పెద్దకుంభకోణం జరిగిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో విశాల్ జట్టు విజయం సాధిస్తుంది. ఆ తరువాత ఆయన సంఘ సభ్యుల అవసరాలన్నీ పూర్తి చేస్తారని అన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని మదురై, దిండుక్కల్, మణపారై, కారైకుడి, పుదుకోట్టై ప్రాంతాలు తిరిగి రంగస్థల నటులను కోరామన్నారు. అప్పుడు వాళ్లు సంఘం గురించి పలు ఫిర్యాదులు చేశారన్నారు. పుదుకోట్టైకు చెందిన దేవి అనే రంగస్థల కళాకారిణి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటే ఆర్థికసాయం అందించామన్నారు. నడిగర్‌సంఘం సభ్యులకు మాత్రమే సాయపడాలని కరుణాస్ అన్నారు.