తాలిపేరు గేట్లు ఎత్తివేత
Published Tue, Sep 13 2016 2:57 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM
చర్ల: ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో మంగళవారం ఉదయం అధికారులు జలాశయం 6 గేట్లను రెండడుగుల మేర ఎత్తి దిగువకు 8,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 73.60 అడుగులు. ప్రస్తుతం ఎగువ నుంచి వరద తగ్గుముఖం పడుతోంది.
Advertisement
Advertisement