► భర్త వికృత చేష్టలపై సహాయవాణి కేంద్రంలో ఫిర్యాదు
యశ్వంతపుర: భార్యకు గుండు కొట్టించి బయటకు పంపకుండా చిత్రహింసలకు గురి చేస్తున్న భర్త ఉదంతం ఇది. ఇతని వికృత చేష్టలపై భార్య మహిళా సహాయ వాణి కేంద్రంలో ఫిర్యాదు చేసింది. వివరాలు.. కేజీ హళ్లికి చెందిన బాధిత మహిళ(26)కు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. దంపతులకు నాలుగేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. పెళ్లికి ముందే ఆమె ఓ సంస్థలో పనిచేసేది.
వివాహమైన తర్వాత ఆమె విధులకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. అంతేగాకుండా గుండు కొట్టించి ముఖంపై కత్తితో గాట్లు పెట్టి మానసికంగా హింసిస్తున్నాడు. వేధింపులు భరించలేని సదరు బాధితురాలు ఇటీవల మహిళా సహాయవాణి కేంద్రంలో ఫిర్యాదు చేసింది. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.