
వివాహ సమయంలో రామస్వామి, సత్యప్రియ
టీ.నగర్: వివాదాస్పద ఎంపీ శశికళ పుష్పపెళ్లి వివాదం రచ్చకెక్కింది. ఆమె పెళ్లి చేసుకోనున్న రామస్వామిపై మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్నాడీఎంకే వివాదాస్పద ఎంపీ శశికళ పుష్ప రామస్వామి అనే వ్యక్తిని వివాహం చేసుకునేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 26న వీరి వివాహం ఢిల్లీలో జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం రామస్వామి మొదటి భార్య తెరమీదకు వచ్చారు. మదురై మహాలింగ పట్టికి చెందిన తనకు, రామస్వామితో 2014లో వివాహం జరిగిందని మంగళవారం విలేకర్లకు వెల్లడించింది. అందుకు తగిన ఆధారాలను, తన బిడ్డతో పాటు ఉన్న చిత్రాన్ని చూపింది. దీని గురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment