
వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి పనిచేస్తా
నటుడు సుమన్
శివాజీనగర (బెంగళూరు): వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేస్తానని నటుడు సుమన్ వెల్లడించారు. ‘రాజకీయాల్లోకి రావా లని ప్రస్తుతం ఉన్న పార్టీలతో పాటు అభిమానుల నుంచి ఒత్తిడి ఉంది. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండ టంతో ఏ నిర్ణయాన్ని తీసుకోలేక సందిగ్ధంలో ఉన్నాను’ అని సుమన్ పేర్కొన్నారు. గురువారం బెంగ ళూరు వచ్చిన సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయం అనేది జీవితాంతం ఉంటుందన్నారు.