
కర్ణాటక, బొమ్మనహళ్లి: నవంబర్ నెల వచ్చిందంటే చాలు ఈ నెల నుంచి జనవరి వరకు రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలాలు పర్యాటకులతో రద్దీగా ఉంటాయి. కానీ కొంతమంది యువకులు, పురుషుల ఆగడాల వల్ల రాష్ట్రంలో ఉన్న బీచ్‌లో పర్యాటకులు చాల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటివాటికి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయి సీఎం కుమారస్వామికి లేఖ రాశారు. బెంగళూరు, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన యువకులు బీచ్‌లకు వెళ్ళి నగ్నంగా నీళ్ళలో ఆడుతుంటారని తమకు ఫిర్యాదులు వచ్చినట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు.
ముఖ్యంగా గోకర్ణ, మంగళూరు, ఉడుపిలో ఉన్న బీచ్‌లో ఇలాంటి దుందుడుకు చర్యలు జరుగుతున్నాయని లేఖలో తెలిపారు. ఇక్కడ బీచ్‌ల వద్ద యువకులకు అన్ని దురలవాట్ల వస్తువులు లభిస్తున్నాయని చెప్పారు. పిల్లలు, మహిళలు ఉన్నారని కూడా చూడకుండా నగ్నంగా నీటిలో తిరుగుతున్నారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలను తీసుకోవాలని లేఖలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment