
బాబు అంటే అబద్ధం.. మోసం.. వెన్నుపోటు
కడప: తనకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏ విషయాలు తెలియడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్తున్నారని వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అందుకే ఆయనకు రాష్ట్రంలో కరువు ఉంది.. రైతులు నానా కష్టాలుపడుతున్నారని చెప్పేందుకు నేడు ఈ మహాధర్నా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.
రాయలసీమ ఆయకట్టుకు నీళ్లు అందించకపోవడానికి నిరసనగా కడప కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రైతు మహాధర్నాలో భారీ సంఖ్యలో పాల్గొన్న రైతులు, రైతు నాయకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
- రాష్ట్రంలో కరువుందన్న విషయం చంద్రబాబునాయుడికి తెలియదంట.
- వాస్తవానికి కరువు పరిష్కారంపై కేబినెట్ నిర్వహించాలి. రైతులకు ఎలా తోడుగా ఉండాలి, ఎలా ఆదుకోవాలనే విషయంపై సమీక్ష నిర్వహించాలి
- కానీ ముఖ్యమంత్రి మాత్రం తనకు అసలు కరువు, వర్షం వివరాలు తెలియడం లేదంట.
- స్విస్ చాలెంజ్ కోసం కేబినెట్ భేటీ నిర్వహించే చంద్రబాబు రైతుల కరువుపై మాత్రం సమావేశం నిర్వహించడం లేదు.
- ఆగస్టు 12న ఏ ముఖ్యమంత్రి అయినా కేబినెట్ భేటీ నిర్వహించి సమీక్ష నిర్వహించాలి
- కరువుపై మభ్యపెట్టేందుకు మేనేజ్మెంట్ టీం తీసుకొచ్చి రెయిన్ గన్లు తీసుకొచ్చారు
- ఇవి ఇప్పుడు ఉన్నవి కాదు.. ఎప్పటి నుంచో ఉన్నవి.. అయినా సీఎం చంద్రబాబు ఏదో గొప్ప చేసినట్లు చెప్తున్నారు.
- ఖరీఫ్‌లో రైతులను ఆదుకునేందుకు, వారికి రుణాలు ఏమేరకు అందాయో తెలుసుకునేందుకు ఆగస్టు 12లోపు సమావేశం నిర్వహించాల్సి ఉండగా దానిని సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 15కు వాయిదా వేశారు
- సెప్టెంబర్ 15న ఈ మీటింగ్ వల్ల రైతులకు మేలు జరుగుతుందా?
- చంద్రబాబుకు రైతులమీద ప్రేమ నిజంగా ఉందా?
- కడప రాయచోటికి వచ్చి హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే చేశారట
- మేం పొలాలకు వెళ్లి రైతులను కలిసి కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నాం
- వరదలు వచ్చినప్పుడు ఏరియల్ సర్వే చేస్తారు
- కానీ, కరువు వచ్చినా చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారు.
- కరువు కూడా ఎరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రిని నేను ఇప్పటివరకు చూడలేదు
- రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు నాయుడు
- కరువు రాకుండా ఉండేందుకు ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా రైతులను రక్షించాలి
- శ్రీశైలంలో నీళ్లు నిండుగా ఉన్న వాటిని కిందకు ఎడాపెడా తోడేస్తున్నారు
- సీఎం చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్చాలా.. బంగాళాఖాతంలో వేయాలా
- రైతులను మోసం చేయడంలో చంద్రబాబునాయుడు పీహెచ్ డీ తీసుకున్నారు
- ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే అబద్ధం.. మోసం.. వెన్నుపోటు