
'ప్రజలను మోసం చేయడమే లక్ష్యం'
అనంతపురం: ప్రజలను మోసం చేయడమే టీడీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక ఆర్‌డీవో కార్యాలయం ఎదుట ధర్నాచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని గద్దెనెక్కిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారిని గాలికి వదిలేసిందన్నారు. ప్రజలను మోసం చేయడంలో టీడీపీ నేతలు నిష్ణాతులని గుర్నాథరెడ్డి అన్నారు.