- అటవీ సంపదలో గిరిజనులకు హక్కులు కల్పిస్తాం
- రాష్ర్ట అటవీ శాఖ మంత్రి జోగు రామన్న
ఆటోనగర్:పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపునకు తెలంగాణ వ్యాప్తంగా 1.20 కోట్ల మొక్కలను ఈ వర్షాకాలంలో నాటనున్నామని, దీనికి స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అవసరమని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం ఆటోనగర్‌లోని మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరి జనులకు అవగాహన కల్పించి, వారికి అటవీ సంపదలో భాగస్వామ్య హక్కులను కల్పిస్తామన్నారు.
sమూడేళ్ల ప్రణాళికలో భాగంగా అడవుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తామని తెలి పారు. కార్యక్రమంలో భోద్ ఎమ్మెల్యే బాబూరావు రాథో డ్, పీసీసీఎఫ్ పీకే శర్మ, అడిషనల్ పీసీసీఎఫ్ శ్యాంప్రసాద్, డీఎఫ్‌ఓ అశోక్‌కుమార్, హరిణ వనస్థలి రేంజ్ ఆఫీసర్ మారెడ్డి, అటవీఅభివృద్ధి సంస్థ ఎండీ రాజేష్ విరాట్, సీజీఎం పృథ్వీరాజ్, ఎకోటూరిజమ్ డెరైక్టర్ శేర్వానంద్, జీఎం ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.