1 నుంచి ఆరు కేజీల బియ్యం | 1 kg of rice from the six | Sakshi
Sakshi News home page

1 నుంచి ఆరు కేజీల బియ్యం

Published Sun, Dec 28 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

1 నుంచి ఆరు కేజీల బియ్యం

1 నుంచి ఆరు కేజీల బియ్యం

  • కుటుంబంలో అందరికీ పంపిణీ: మంత్రి ఈటెల  
  • హాస్టళ్లకు, మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం కూడా
  • పేదలకు గులాబీ రంగులో రేషన్ కార్డులు.. పాత గులాబీ కార్డుల స్థానంలో తెల్ల కార్డులు
  • కార్డుల జారీ ఆలస్యమైనా సరుకులు అందిస్తామని వెల్లడి
  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పేదలకు వచ్చే జనవరి 1నుంచి ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున బియ్యం పంపిణీని ప్రారంభిస్తామని ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఆరు కేజీల చొప్పున బియ్యం ఇస్తామని, అలాగే హాస్టళ్లకు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యాన్ని కూ డా 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లాల కలెక్టర్లకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. మంత్రి ఈటెల శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
     
    కొత్త కార్డులు సరుకులకే పరిమితం: అల్పాదాయ వర్గాలకు గతంలో ఉన్న తెల్ల రేషన్‌కార్డు ల స్థానంలో కొత్తగా గులాబీ రంగు రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ఈటెల తెలిపారు. ఇప్పటివరకూ ఉన్న గులాబీ కార్డుల స్థానంలో తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. కొత్తగా జారీ చేసే గులాబీ రంగు కార్డులు బియ్యం, కిరోసిన్, గోధుమలు, పంచదార, కందిపప్పు వంటి రేషన్ సరుకులకు మాత్రమే పరిమితమని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ తదితర పథకాలకు ఈ కార్డులను పరిగణనలోకి తీసుకోబోరని చెప్పారు.

    జనవరి నెలాఖరులోగా 99 శాతం రేషన్ కార్డుల పంపిణీని పూర్తి చేస్తామని... కొత్త కార్డులు అందడం ఆలస్యమైనా జనవరి 1వ తేదీ నుంచే బియ్యం పంపిణీ కొనసాగుతుందని ఈటెల వెల్లడించారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో ఉన్న రేషన్‌కార్డుల కన్నా ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
     
    పాఠశాలలు, హాస్టళ్లలో: ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని వసతి గృహాలకు సన్న రకం(బీపీటీ) బియ్యాన్ని జనవరి 1నుంచి పంపిణీ చేయనున్నట్లు ఈటెల తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజ న కార్యక్రమానికి కూడా సన్న బియ్యాన్ని ఈ నెల 2వ తేదీ నుంచి (1న సెలవు మేరకు) పం పిణీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. గ్రా మాల్లో సర్పంచులు, మండలాల్లో ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీల్లో కా ర్పొరేటర్లు, చైర్మన్లు, నగరాల్లో మేయర్లు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కేంద్రాల్లో మంత్రులందరూ ఈ బియ్యం పంపి ణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
     
    అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: సంక్షే మ పథకాలను పూర్తి పారదర్శకంగా అమలుచేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి ఈటెల చెప్పారు. గతంలో కన్నా ఎక్కువ బియ్యం, ఎక్కువ రేషన్‌కార్డులు ఇస్తున్నామని... ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. రేషన్‌కార్డుల సంఖ్యకు అనుగుణంగా గ్రామాలు, మండల  కేంద్రాలు, మున్సిపాలిటీల వారీగా రేషన్ షాపులను పెంచుతామని తెలిపా రు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, పౌర సరఫరాల శాఖ అధికారులు ఉన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement