Itela Rajendar
-
టెన్త్ పరీక్షా పేపర్ లీక్ కేసు కొత్త మలుపులు
-
‘మెడికల్ పీజీ ఇన్ సర్వీస్’ ను పునరుద్ధరించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్యులు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిని కలిశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. మెడికల్ పీజీ ప్రవేశాల్లో ఇన్ సర్వీసు కోటాను పునరుద్ధరించాలని ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్ అమలు చేస్తున్న వైద్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ప్రసవాల కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావాలని, తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) కమిషనర్ పోస్టును విధిగా సీనియర్ వైద్యునికే ఇవ్వాలని విజ్ఞఫ్తి చేశారు. శనివారం వారు సచివాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో సమావేశమై దాదాపు రెండు గంటలపాటు తమ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో అధికారులతోపాటు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.నరహరి, కోశాధికారి డాక్టర్ రవూఫ్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(ప్రజారోగ్య విభాగం) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.సుధాకర్, సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలు ప్రసాద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, రాష్ట్ర కోశాధికారి దీన్‌దయాళ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నాగార్జున, డాక్టర్ సాయిబాబా, డాక్టర్ వినోద్, డాక్టర్ సాల్మన్, డాక్టర్ రవితేజ, డాక్టర్ దాక్షాయణి తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం ఆ రెండు సంఘాల నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అవకాశమున్న మేరకు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారని నరహరి తెలిపారు. వైద్యుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వైద్యులు కూ డా ప్రజలకు సేవచేయడానికి అంతే చిత్తశుద్ధి తో పనిచేయాలని మంత్రి కోరారన్నారు. నాణ్యమైన వైద్యం సామాన్యులకు అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యుల డిమాండ్లు ఇవీ... ►2016లో యూజీసీ ఇచ్చిన వేతన స్కేల్‌ను అమలు చేయాలి. నాటి నుంచి సంబంధిత బకాయిలు చెల్లించాలి. ►పీజీ వైద్య విద్యను మరింత పరిపుష్టం చేయడం, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందజేయడం కోసం నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఫ్యాకల్టీని మరింత బలోపేతం చేయాలి ►బోధనాసుపత్రుల్లోని వైద్యులకు నిర్ణీతకాల పదోన్నతులు కల్పించాలి ►ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మించడం ►వైద్యవిధాన పరిషత్ వైద్య ఉద్యోగులకు ట్రెజరీ వేతనాలు అందజేయాలి ►వైద్య విధాన పరిషత్‌లోని వైద్యులందరికీ ఆరోగ్యకార్డులు అందజేయాలి ►2004 తర్వాత చేరిన ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ స్కీం బదులు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి ►జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల అధ్యాపకులకు బేసిక్ వేతనంలో 40 శాతం అదనంగా ప్రోత్సాహకం ఇవ్వాలి ►సిబ్బంది స్థాయిని పెంచి వైద్యులకు త్వరగా పదోన్నతులు వచ్చేలా చూడాలి ►వివిధ రకాలైన అలవెన్సులు త్వరగా విడుదల చేయాలి ►హైదరాబాదులోని వైద్యులకు సంబంధించి జీవో 140 ని అమలు చేయాలి ►వైద్యాధికారులకు వాహన సౌకర్యము లేదా రవాణా భత్యం కల్పించాలి ►జాతీయ కార్యక్రమాల అమలుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలి ►దూరపు ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలు, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నవారికి బదిలీలు కల్పించాలి ►వైద్యులపై అన్యాయంగా విధించిన సస్పెన్షన్‌ను తొలగించాలి ►ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలి ►ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలి -
'హైదరాబాద్ కు 100బస్సులు నడిపిస్తాం'
కరీంనగర్ లో ఆర్టీసీ సిటీ సర్వీసులను తెలంగాణ మంత్రులు మహేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మరో 500 బస్సులను కొనుగోలు చేయనుందని ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ కు భారీగా సర్వీసులను నడిపిస్తామని చెప్పారు. దీని కోసం 100 బస్సులను కేటాయించనున్నట్లు తెలియజేశారు. ఆర్టీసీ పేద ప్రజల ఆస్తి అని మరో మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సంస్థను వ్యాపార సంస్థగా భావించి.. లాభాల బాటలోకి తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీని అన్ని రంగాల్లో ఆదుకోడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగాఉంటుందని చెప్పారు. -
కేటాయింపులు ఘనం..ఖర్చుశూన్యం
ప్రభుత్వంపై విపక్షాల మండిపాటు బడ్జెట్ కేటాయింపులపై సుదీర్ఘ వివరణ ఇచ్చిన ఆర్థిక మంత్రి అన్నీ గారడీ లెక్కలని కాంగ్రెస్ విమర్శ బడ్జెట్ వాస్తవ దూరమంటూ వాకౌట్ ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ లెక్కలన్నీ తప్పుల తడకలేనని.. గత బడ్జెట్లో లక్షా ఆరు వేల కోట్ల కేటాయింపులు చూపి, చివరికి సగం నిధులను కూడా ఖర్చు చేయలేదని ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ ఏడాది బడ్జెట్ కూడా వాస్తవాలకు దూరంగా ఉందంటూ మండిపడ్డాయి. గురువారం అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ సభ్యులు అధికార పక్షంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతేడాది బడ్జెట్‌తో పాటు తాజాగా ప్రవేశపెట్టిన (2015-16) బడ్జెట్ అంశాలపై సర్కారును నిలదీస్తూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఆమోదించింది. అవసరం లేనిచోట తగ్గించాం ద్రవ్య వినిమయ బిల్లుపై సాగిన చర్చలో మంత్రి ఈటెల రాజేందర్ సుదీర్ఘంగా మాట్లాడారు. రూ. 1.15 లక్షల కోట్లతో 2015-16 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కారణాలను, ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యతాంశాలను సభకు వివరించారు. తొలి బడ్జెట్‌కు సంబంధించి తొమ్మిది నెలల కాలంలో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 65 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఈసారి బడ్జెట్లో అవసరమైన చోట కేటాయింపులు పెంచి, అవసరం లేని చోట తగ్గించామన్నారు. రూ. 900 కోట్ల పింఛన్ల బడ్జెట్‌ను రూ. 4వేల కోట్లకు పెంచినట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని ఈటెల పేర్కొన్నారు. బడ్జెట్లో 18 శాతం (రూ. 9,150 కోట్లు) వ్యవసాయానికే కేటాయించినట్లు తెలిపారు. 89.14 లక్షల మందికి ఆహార భద్రతా కార్డులు జారీ చేశామని చెప్పారు. విద్యుత్ మిగులు సాధించేదిశగా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీకి తీసుకెళ్లిన అడ్వోకేట్ల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించామని, మరమగ్గాల కార్మికుల రుణాలను మాఫీ చేశామని చెప్పారు. దళితులను ముంచారు.. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద దళితులకు అందాల్సిన నిధుల్లో భారీగా కోత విధించిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. 2014-15 బడ్జెట్లో ప్రణాళికా వ్యయం కింద రూ. 48 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. కేవలం రూ. 20,010 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని పేర్కొన్నారు. వాస్తవ వ్యయానికి సంబంధించిన లెక్కలను చివరిరోజైనా సభలో ప్రవేశపెట్టకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవాలకు భిన్నంగా ఉన్న ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. ఇక బడ్జెట్ అంటే జీవం లేని అంకెలు కాదని తన ప్రసంగంలో చెప్పిన ఆర్థిక మంత్రి గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎంత జీవం ఉందో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరువు నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించని ప్రభుత్వం.. సెక్రటేరియట్, రవీంద్ర భారతిని కూల్చేందుకు మాత్రం సిద్ధమవుతోందని దుయ్యబట్టారు. సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. కేజీ టు పీజీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. ముఖ్యమైన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సీఎం సభలో లేకపోవడం పట్ల ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం బడ్జెట్ సమావేశాల ముగింపు రోజున ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఆమోదించింది. గురువారం ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ సాగింది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం తెలపాలని మంత్రి ఈటెల కోరగా... రూ.1.15 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వాకౌట్ చేసింది. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదిస్తున్నట్లు సభాపతి మధుసూదనాచారి ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. -
అన్నీ తెలియాలంటే మాలో చేరండి
బీజేపీ ఎమ్మెల్యే చింతలతో మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ పద్దులపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎమెల్యే చింతల రామచంద్రారెడ్డి, పలువురు అధికారపక్ష సభ్యుల మధ్య ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. హోం, వ్యవసాయ, రెవెన్యూ, రవాణా, ఎక్సైజ్, సేల్స్‌టాక్స్‌కు సం బంధించిన అంశాల గురించి చింతల పలు సందేహాలను వెలిబుచ్చగా బడ్జెట్లో ఆయా అంశాలను పొందుపరిచామని, అవి సవ్యం గానే ఉన్నాయని మంత్రులు నాయిని నర్సిం హారెడ్డి, ఈటెల రాజేందర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమాధానాలతో సంతృప్తిచెందని ఇతర అంశాలను ప్రస్తావించగా ఈటెల స్పందిస్తూ ‘అన్ని విషయాలు తెలియాలంటే మాలో వచ్చి చేరండి. అన్నింటినీ వివరించే అవకాశముంటుంది’ అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై అదనపు వ్యాట్‌ను విధిం చడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన రాబడి తగ్గుతోందని మరో సందర్భంలో చింతల పేర్కొనగా.. దీనిపై కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటూ ఏపీ గురించి చెప్పడం లేదేంటి? టీడీపీ మీ మిత్రపక్షమనా? అంటూ ప్రశ్నించారు. దీనిపై చింతల బదులిస్తూ ‘టీడీపీ వాళ్లు దోస్తులు ..అయితే మీరు దుష్మన్లా’ అని ప్రశ్నించారు. తెలంగాణకు టీడీపీ ద్రోహం చేసిందని.. అందుకే వ్యతిరేకిస్తున్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెట్టించగా తెలంగాణ వద్దని లేఖ ఇచ్చిన ద్రోహులను (ఎంఐఎంను ఉద్దేశించి) భుజాల పైకి ఎత్తుకుని జీహేచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. -
హైకోర్టు విభజనకు టీడీపీ మోకాలడ్డు: ఈటెల
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన, ఇతర అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం అంతంతమాత్రమేనని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హైకోర్టు విభజన ను టీడీపీ అడ్డుకుంటోందని అంటూ ఆ పార్టీ తో బీజేపీ చెట్ట్టపట్టాలు వేసుకుని తిరుగుతోం దని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులు, కార్పొరేషన్లు, హైకోర్టువిభజన.. ఇలాఅన్ని విషయాల్లో సహకరించడం లేదన్నారు. ‘కాళ్లల్లో కట్టె పెట్టే విధంగా’ వ్యవహరిస్తూ కుట్ర పూరిత పద్ధతుల్లో వివిధ విభాగాల్లో విభజనకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని విమర్శిం చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ మంత్రులు, ఏపీ ప్రభుత్వంలో బీజేపీ మంత్రులున్నారని ఆయన గుర్తుచేశారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రభుత్వ పద్దులపై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ర్ట ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదని, ఆయా అంశాల వారీగా ప్రస్తావించారు. దీనిపై మంత్రి ఈటెల స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. విభజన ప్రక్రియ సరిగ్గా జరగకుండా టీడీపీ కుట్రలు చేస్తున్న విషయం అంగీకరిస్తారా లేదా అని మంత్రి ప్రశ్నించారు. కమలనాథన్ కమిటీ, హైకోర్టు, నదీ జలాలు, విద్యుత్ వంటి ముఖ్యమైన విషయాల్లో ఇది కొనసాగుతోం దని అన్నారు. తాత్కాలిక వసతి ఏర్పాటుచేస్తే హైకోర్టు విభజనకు తాము సిద్ధమని కేంద్రమంత్రి సదానంద్గౌడ చెప్పారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అంటూ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల జాప్యం జరుగుతోందని ఆరోపించారు. దీనిపై ఈటెల స్పందిస్తూ సీఎం కేసీఆర్ ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నారని బదులిచ్చారు. కేంద్రంతో ఘర్షణ వైఖరిని కూడా అవలంబించడం లేదన్నారు. న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ హైకోర్టు విభజన కోసం న్యాయవాదులు పోరాడుతున్నారని, దీనిపై అడిగితే ప్రక్రియ సాగుతోందని కేంద్రం నుంచి సమాధానమొచ్చిందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వజాప్యం ఎలా అవుతుందని ప్రశ్నిం చారు. సీఎం ముందుకొచ్చి స్థలం తామే ఇస్తామని చెప్పాకే కదలిక వచ్చిందన్నారు. -
ప్రతిపాదనల బడ్జెట్.. 3 లక్షల కోట్లు
మూడింతలు పెరిగిన శాఖల అంచనాలు.. అంతగా ఇవ్వలేమంటూ తలపట్టుకున్న ఆర్థిక శాఖ మళ్లీ ప్రతిపాదనలు సమర్పించాలంటూ సూచన అనుకున్నంత ఆదాయం తీసుకురాకపోతే ఎలా..! ‘రెవెన్యూ’ తెచ్చే శాఖలపై ఆర్థికశాఖ అసంతృప్తి రేపటితో ముగియనున్న బడ్జెట్ ముందస్తు చర్చలు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది రాష్ట్ర బడ్జెట్ రూ. 3,00,000 కోట్లు..! ఇదేంటి మూడింతలు దాటిపోయిందని ఆశ్చర్యపోవద్దు... ఈసారి కేటాయింపుల కోసం వివిధ శాఖలు ఇచ్చిన ప్రతిపాదనల మొత్తం ఇది. బడ్జెట్ ముందస్తు చర్చల్లోనే ఆర్థిక శాఖ దిమ్మతిరిగిపోయేలా ప్రభుత్వ విభాగాలన్నీ కోరికల చిట్టా విప్పాయి. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా మూడింతలకు పైగా నిధులు కావాలంటూ ప్రతిపాదనలు సమర్పించాయి. అంతేకాదు... ‘కొత్త రాష్ట్రం కావడంతో ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలంటే ఇంత భారీగా నిధులు ఇవ్వాల్సిందేనని కొసరు మెరుపూ ఇచ్చేశాయి.. 2015-16 సంవత్సరానికి బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారం కిందే కసరత్తు ప్రారంభించింది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ నెల 10వ తేదీ నుంచి అన్ని శాఖల మంత్రులతో విడివిడిగా బడ్జెట్‌పై ముందస్తు చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి ప్రాతి నిధ్యం వహిస్తున్న శాఖలు మినహా అన్ని శాఖలతో చర్చలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దాదాపు శాఖలన్నీ ఆర్థిక శాఖకు తమ ప్రతిపాదనలను సమర్పించాయి. కానీ గత ఏడాదితో పోలిస్తే ఏకంగా మూడింతలకుపైగా నిధులు కావాలంటూ ఇచ్చిన ప్రతిపాదనలను చూసి ఆర్థిక శాఖ వర్గాలు విస్తుపోయాయి. అన్ని నిధులు ఇవ్వాలంటే ఏకంగా రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ సమర్పించాల్సి ఉంటుందంటూ తల పట్టుకున్నాయి. తగ్గాల్సిందేనన్న ఆర్థిక శాఖ.. సాగునీటి రంగానికి రూ. 17,692 కోట్లు ఇవ్వాలని నీటి పారుదల శాఖ కోరగా... ఇంత ఇవ్వలేమని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రూ. 10 వేల కోట్ల కంటే తక్కువకు తగ్గించి ప్రతిపాదనలు అందజేయాలని సూచించింది. కీలకమైన మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ) రూ. నాలుగు వేల కోట్లు కోరింది. విద్యుత్ శాఖ రూ. 12,600 కోట్లు కావాలని ప్రతిపాదించింది. గత ఏడాది విద్యుత్ శాఖకు ప్రభుత్వం రూ. 3,500 కోట్లు కేటాయించడంతో పాటు మరో రూ. 1,000 కోట్లను జెన్కోలో పెట్టుబడిగా పెట్టింది. దీనితో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ నిధులు కోరింది. కానీ అంత ఇవ్వలేమని ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. ఇక పరిశ్రమల శాఖకు గత ఏడాది రూ. 830 కోట్లు కేటాయించగా... ఈసారి రూ. 2,300 కోట్లు కావాలని ప్రతిపాదనలు సమర్పించారు. ఆర్అండ్బీ విభాగం సైతం గతం కంటే ఘనంగా రూ. 10,800 కోట్లు కావాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆదాయమేదీ..? ఆదాయం తెచ్చి పెట్టాల్సిన శాఖలు ఆశించిన లక్ష్యాన్ని చేరుకోకపోవడంపై చర్చల సందర్భంగా ఆర్థిక శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాణిజ్య పన్నుల విభాగం ద్వారా 2014-15లో మొత్తం రూ. 27,777 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే... జనవరి వరకు రూ. 18,500 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. దీంతో ఫిబ్రవరి, మార్చి నెలల వ్యవధిలోనే కనీసం మరో రూ. 6,000 కోట్లు రాబట్టాలని ఆర్థిక శాఖ సూచించింది. వచ్చే ఏడాది రూ. 39,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా ఎంచుకొని సాధించాలని వాణిజ్య పన్నుల శాఖను కోరింది. వాణిజ్య పన్నులు, రెవెన్యూ, ఎక్సైజ్ విభాగాల ద్వారానే రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం రావాల్సి ఉందని... లక్ష్య సాధనలో ఆ విభాగాలు వెనుకబడితే ఆదాయం బాగా తగ్గిపోతుందని చర్చల సందర్భంగా మంత్రి ఈటెల సంబంధిత అధికారులకు స్పష్టం చేసినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇబ్బడి ముబ్బడిగా నిధులు కావాలని కోరుతూ ప్రతిపాదనలిచ్చిన మిగతా విభాగాలు.. వీలైనంత కుదించి ఇవ్వాలని ఆర్థిక శాఖ సూచించింది. బుధవారంతో బడ్జెట్‌పై ముందస్తు చర్చలు ముగియనున్నాయి. అవసరాన్ని బట్టి కొన్ని శాఖలతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. పన్ను వసూళ్ల కోసం రూ. 496 కోట్లు! చెక్‌పోస్టులు, తనిఖీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో అధిక మొత్తాన్ని కేటాయించాలని వాణిజ్య పన్నుల శాఖ ఆర్థిక శాఖను కోరింది. రెండు ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులతో పాటు ఏడు సరిహద్దు చెక్‌పోస్టుల నిర్మాణం, కమిషనరేట్ భవన నిర్మాణం, ఇతర వ్యయం కోసం రూ. 496 కోట్లు కేటాయించాలని కోరింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1,373.30 కోట్లు కేటాయించాలంటూ అటవీ శాఖ ప్రతిపాదించింది. ఇప్పటికే భారీగా కోతలు.. గత ఏడాది నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం పది నెలల కాలానికి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ రూ. లక్ష కోట్ల మార్కు దాటింది. భారీగా ఉండాలనే లక్ష్యాన్ని ప్రధానంగా ఎంచుకోవడంతో వాస్తవ అంచనాలు పట్టుతప్పాయి. తీరా బడ్జెట్ కేటాయింపులకు వాస్తవ ఆదాయ, వ్యయాలకు పొంతన లేని పరిస్థితి తలెత్తింది. కేంద్రం నుంచి రావాల్సినన్ని నిధులు అందకపోవడం, అదనంగా ఎంచుకున్న ఆదాయ మార్గాలు ఆచరణలో సఫలం కాకపోవటం, అప్పుల పరిమితి కూడా పెరగకపోవటంతో 2014-15 ఏడాది ఆదాయం రూ. 75 వేల కోట్లకు మించడం గగనంగా మారింది. మిగతా రూ. 25 వేల కోట్ల పైచిలుకుకు బడ్జెట్లో కోత అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో మొదలైన రెండో బడ్జెట్ కసరత్తు అత్యంత ప్రాధాన్యంగా మారింది. దానికితోడు వివిధ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలు చుక్కలు చూపిస్తున్నాయి. -
వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్ 6,500 కోట్లు?
సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్లో వైద్య ఆరోగ్యశాఖకు రూ.6,500 కోట్లు కేటాయించాలని ఆ శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి శనివారం ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌కు విన్నవించారు. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా తదితర అధికారులు సచివాలయంలో ఈటెలతో సమావేశమయ్యారు. -
వ్యవసాయ బడ్జెట్ రూ. 7,500 కోట్లు?
రెండు వేల ఎకరాల్లో గ్రీన్హౌస్.. రూ. 500 కోట్లు రూ. 4,250 కోట్లు రెండో విడత రుణమాఫీకి నేడు ఆర్థిక మంత్రితో భేటీ కానున్న పోచారం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో వ్యవసాయశాఖకు రూ. 7,500 కోట్లు కేటాయించాలని వ్యవసాయశాఖ ప్రతిపాదిం చింది. మంగళవారం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో జరిగే బడ్జెట్ ముందస్తు సమావేశంలో ఈ మేరకు నివేదికను అందించనుంది. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం తన శాఖలోని అన్ని విభాగాల అధికారులతో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గత ఏడాది కంటే ప్రతీ విభాగంలో 20 నుంచి 30 శాతం అదనంగా నిధుల అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలను తయారు చేశారు. వ్యవసాయశాఖకు రూ.7,500 కోట్లను కోరనుండగా... అందులో ప్రణాళిక కింద రూ. 2,472 కోట్ల మేరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రణాళికేతర బడ్జెట్లో రూ. 4,250 కోట్లను రుణమాఫీ రెండో విడత కోసం కేటాయించనున్నారు. మిగతా సొమ్మును వేతనాలు, ఇతరత్రా ఖర్చులకు వినియోగిస్తారు. గ్రీన్‌హౌస్‌కు రెండింతలు... ఈసారి బడ్జెట్లో గ్రీన్హౌస్, సూక్ష్మసేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ, కోల్డ్‌స్టోరేజీలు, రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజన (ఆర్కేవీవై) తదితర పథకాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. సూక్ష్మసేద్యానికి రూ. 800 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు తయారుచేశారు. రెండు వేల ఎకరాల్లో గ్రీన్హౌస్ (పాలీహౌస్)ల ఏర్పాటుకు రూ. 500 కోట్లు కేటాయించాలని కోరనున్నారు. ఇక వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 234 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇక విజయ డెయిరీని అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం పాడి రైతులకు లీటరుకు రూ. 4 ప్రోత్సాహకం కింద ఇస్తున్న నేపథ్యంలో... దానిని వచ్చే ఏడాది కూడా కొనసాగించేందుకు రూ. 36 కోట్లు కోరనున్నారు. మొత్తంగా పాత పథకాలే కొనసాగుతాయని, కొత్త పథకాలకు వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టకపోవచ్చని తెలుస్తోంది. ‘గిరిజన’శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15)లో గిరిజన సంక్షేమ శాఖకు బడ్జెట్లో కేటాయించిన మొత్తాన్ని ఏ మేరకు ఖర్చుచేశారు, మిగతా నెలన్నర రోజుల్లో ఏ మేరకు ఖర్చు చేయగలరనే అంశంపై సోమవారం శాఖ కార్యదర్శి జీడీ అరుణ సచివాలయంలో సమీక్షించారు. బడ్జెట్లో గిరిజన ఉప ప్రణాళిక (సబ్‌ప్లాన్)లో వివిధ శాఖల వారీగా కేటాయించిన మొత్తం రూ. 4.559 కోట్లలో (శాఖకు కేటాయించిన బడ్జెట్ రూ. 1,237 కోట్లు కలిపి) దాదాపు 60 శాతం నిధులు విడుదల కాగా... 30-40 శాతం వరకు వ్యయమైనట్లు తేలింది. మొత్తం రూ.1,237 బడ్జెట్లో ఇంజనీరింగ్ విభాగం రూ. 229 కోట్లు బిల్లుల ద్వారా తీసుకోవాల్సి ఉంది. మరో నెలన్నర రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున నిధుల వ్యయం వేగాన్ని పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వచ్చే బడ్జెట్ 2015-16కు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖకు రూ. 2 వేల కోట్ల మేర ప్రతిపాదనలు పంపించాలని శాఖాధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. దీనితోపాటు వివిధ శాఖల నుంచి వచ్చే గిరిజన సబ్‌ప్లాన్ నిధులు ఎంతనేది పరిశీలించాల్సి ఉంది. -
బడ్జెట్ కసరత్తు షురూ..!
నేటి నుంచి మంత్రులతో ఆర్థికశాఖ భేటీలు అధికారులతో సమావేశమైన ఆర్థిక మంత్రి ఈటెల 2015-16 బడ్జెట్‌కు ప్రతిపాదనలపై సమీక్ష గత బడ్జెట్ అంచనాలు, ఆదాయ వ్యయాలపై చర్చ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ముందుగా ముసాయిదా బడ్జెట్ తయారీకి ఆర్థిక శాఖ సన్నద్ధమైంది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం నుం చి దాదాపు వారం రోజుల పాటు అన్ని శాఖల మంత్రులతో చర్చలు జరపనున్నారు. ఏయే పథకాలకు ప్రాధాన్యమివ్వాలి, ఏయే రంగాలకు ఎంత మేరకు నిధులు కేటాయించాలనే అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఆదాయం పెంచుకునే మార్గాలపై సమాలోచనలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మంత్రి ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2015-16 సంవత్సరపు బడ్జెట్ మొత్తం ఎంత ఉండాలి, ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు ఎలా ఉండాలనే దానిపై చర్చించారు. అన్ని విభాగాల నుంచి ఇప్పటికే అందిన ప్రతిపాదనలను మంత్రి పరిశీలించారు. తొలి ఏడాది నిధులు ఖర్చు చేయని శాఖలకు ఈసారి కేటాయిం పులు తగ్గించాలని.. అప్రాధాన్య పద్దులకు కోత వేసి, అదే విభాగంలో ప్రాధాన్యత ఉన్న అంశాలకు నిధులు కేటాయించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆదాయ వనరులు పరిమితంగా ఉన్నందున బడ్జెట్ కేటాయిం పుల్లో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. గతం కంటే ఎక్కువ.. నాలుగు నెలల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,00,637 కోట్ల తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అది కేవలం పది నెలల బడ్జెట్ కావటంతో... 2015-16 పూర్తిస్థాయి బడ్జెట్ అంతకంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక ఈసారి భారీ బడ్జెట్ ప్రవేశపెడతామని ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు కూడా. అయితే గత బడ్జెట్ అంచనాలన్నీ తలకిందులవటం.. నెలనెలా వచ్చిన ఆదాయం ప్రణాళికేతర ఖర్చులకే సరిపోవటంతో నిధుల లేమితో సర్కారు కొట్టుమిట్టాడింది. దీంతో వచ్చే బడ్జెట్ తయారీలో గొప్పలకు పోవద్దని ఆర్థిక శాఖ నిపుణులు సూచించిన నేపథ్యంలో మంత్రులతో జరిగే సమావేశాలు కీలకంగా మారనున్నాయి. -
అక్రమాలను ఉపేక్షించం: ఈటెల
గృహ నిర్మాణ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలి కేసీఆర్‌లో కాఠిన్యమే కాదు.. కారుణ్యమూ ఉంది సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలు జరిగితే ఉపేక్షించేది లేదని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. పేదలకు గూడు కల్పించే కీలక బాధ్యత ఉన్న గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ ఉద్యోగుల జేఏసీ కొత్త సంవత్సర డైరీ, కేలండర్‌ను ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలసి ఆవిష్కరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సీఐడీ విచారణతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఉద్యోగ సంఘ నేతలు మంత్రుల దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన ఈటెల పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పులను ప్రభుత్వాలపై నెడితే కుదరదని, ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమనే విషయాన్ని మరవద్దని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం కక్షపూరితంగా ఉండదని, కేసీఆర్ వద్ద కాఠిన్యమే కాదు కారుణ్యం కూడా ఉందని గుర్తించాలన్నారు. గృహ నిర్మాణశాఖ ఉద్యోగుల పింఛన్, ఇళ్ల స్థలాల కేటాయింపును సీఎం దృష్టికి తీసుకెళ్తానని, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వేతనాల పెం పును పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. సీఐడీ విచారణలో పక్కాగా వివరాలు వెలుగుచూడకపోవచ్చని మంత్రి తుమ్మల అన్నారు. గత ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాల వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తిందని టీఎన్జీవోస్ అధ్యక్షులు దేవీప్రసాద్ అన్నారు. -
తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాబాద్: ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలవదని చరిత్ర రుజువు చేసిందని, అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ఇప్పల్‌నర్సింగాపూర్‌లో రైతులకు కృషి రత్నం అవార్డులను ప్రదానం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కిసాన్ రైతుమిత్ర సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయంపై 75 శాతం మంది ప్రజలు ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ. 3,376 కోట్లు రుణమాఫీ చేస్తే, తెలంగాణ ప్రభుత్వం మొదటి దశలోనే రూ. 4,250 కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది కాలం కాకపోవడంతో విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని, వచ్చే ఏడాది వరకు కొంత మేరకు కష్టాలు గట్టెక్కుతాయని, మరో మూడేళ్లలో కంటి రెప్పపాటు కూడా కరెంటు కోతలు ఉండవని పేర్కొన్నారు. ప్రభుత్వమంటే ప్రైవేట్ లిమిటెడ్ కాదు జమ్మికుంట: ప్రభుత్వమంటే ప్రైవేట్ లిమిటెడ్ కాదని, అది ప్రజలందరిదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేయడమే ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల పరమావధిగా ఉండాలన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బుధవారం జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం ముళ్ల కిరీటం లాంటిదని, అది అందరికీ రాదని, ప్రజల ఓట్లతో వచ్చిన అధికారాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల పాత్ర గొప్పదని, ఒక గ్రామంలో పదిమంది ఐఏఎస్‌లు ఉండవచ్చు కానీ.. ఆ గ్రామానికి ఒక్కరే సర్పంచ్ ఉంటారని, నియోజకవర్గానికి ఒక్కరే ఎమ్మెల్యే ఉంటారని అన్నారు. గ్రామాలలో వార్డు సభ్యులే మూల స్తంభాలని, ప్రభుత్వపరంగా వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులతో సక్రమంగా ఉంటే గ్రామాలలో సమస్యలు తలెత్తవని సూచించారు. -
రూ.11,960 కోట్లు.. ఆగిపోయాయ్!
విడుదల కాని కేంద్ర నిధులు మరో 3 నెలలే గడువు తెచ్చుకోకపోతే మురిగిపోయే ప్రమాదం అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధుల మాట పక్కన పెడితే... ప్రణాళిక నిధులకు సైతం ఎసరొచ్చేలా ఉంది. కొత్త రాష్ట్రం కావటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయానికి ఎదురు చూస్తున్న తెలంగాణకు అపార నష్టం ముంచుకొస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తెలంగాణకు కేటాయించిన ప్రణాళిక నిధులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. వివిధ విభాగాల పరిధిలో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు కేటాయించిన రూ.11,960 కోట్లు ఇప్పటికీ విడుదల కాలేదు. మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఈ నిధులను తెచ్చుకోకుంటే అవన్నీ మురిగిపోనున్నాయి. ఆర్థిక శాఖ అప్రమత్తం.. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ఆర్థిక శాఖ అప్రమత్తమైంది. విభాగాల వారీగా కేంద్రం కేటాయింపులు.. ఇప్పటి వరకు విడుదలైన నిధులు.. వాటి ఖర్చుల వివరాలతో నివేదిక సిద్ధం చేసింది. మార్చిలోగా ఈ నిధులు విడుదల చేయించుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సంబంధిత విభాగాల ఉన్నతాధికారులను నిర్దేశించింది. విభాగాల వారీగా ఆయా శాఖల మంత్రులకు కేంద్రంపై ఒత్తిడి పెంచే బాధ్యతను అప్పగించింది. వారం రోజుల్లో అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఎవరికి వారు తమ శాఖకు సంబంధించి నిలిచిపోయిన నిధులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేయాలని మంత్రులకు, ఉన్నతాధికారులకు సూచించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఢిల్లీకి వెళ్లినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఇటీవల జరిగిన భేటీలోనూ తాను ఈ నిధులను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి నిధుల వినియోగపు పత్రాలు (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) సమర్పించలేదనే కారణంతో కొన్ని విభాగాలు నిధుల విడుదలకు కొర్రీలు పెడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో యూసీలను వెంటనే సమర్పించటంతోపాటు ఆర్థిక సంవత్సరపు గడువు ముగిసేలోగా మిగిలిన నిధులు రాబట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. - సాక్షి, హైదరాబాద్ వచ్చింది 17 శాతమే.. 2014-15 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక పద్దులో తెలంగాణ రాష్ట్రానికి రూ. 14,443 కోట్ల కేటాయింపులు చేసింది. అందులో ఇప్పటి వరకు కేవలం రూ. 2,483 కోట్లు విడుదల చేసింది. కేవలం 17 శాతం నిధులు విడుదలైన తీరు చూస్తే.. కేటాయింపులు కొండంత.. ఇచ్చింది గోరంత.. అన్నట్లుగానే ఉంది. మిగతా 83 శాతం నిధులు కేంద్రం ఖజానాలోనే ఆగిపోయాయి. -
‘వ్యవసాయం’పై సమీక్ష
నేడు జెడ్పీ సర్వసభ్య ప్రత్యేక సమావేశం మంత్రులు పోచారం, ఈటెల హాజరు కరీంనగర్: జిల్లా పరిషత్ సర్వసభ్య ప్రత్యేక సమావేశం మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో జరగనుంది. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగే సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ హాజరవుతారు. జిల్లాలో వ్యవసాయ రంగ స్థితిగతులు, అనుబంధ విభాగాలు, బడ్జెట్ రూపకల్పనపై సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా చేపట్టిన పథకాలతో పాటు ఆయా మంత్రులకు సంబంధించిన శాఖలపై రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్ సమావేశాల ద్వారా అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. సభ్యులకు అవగాహన కల్పించడం, ప్రజలకు తెలియచేయడం, సమావేశాల నుంచి నివేదికలు తీసుకోవడం లక్ష్యంగా ఈ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆయా శాఖలు, పథకాల వారీగా జిల్లా పరిషత్ సర్వసభ్య ప్రత్యేక సమావేశాలను సంబంధిత శాఖ మంత్రితో చేపడుతున్నారు. ప్రస్తుత జెడ్పీ పాలకవర్గం కొలువు తీరాక సాధారణ సమావేశాలకన్నా ప్రత్యేక సమావేశాలే ఎక్కువగా నిర్వహిస్తుండడం విశేషం. ముందుగా సభ్యుల ప్రమాణస్వీకారం, చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించగా, ఆ తరువాత స్థాయీ సంఘం ఎన్నికల కోసం ఒకసారి, బీఆర్జీఎఫ్ పథకంపై రెండోసారి, మిషన కాకతీయపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆధ్వర్యంలో మూడోసారి సమావేశం ఏర్పాటు చేశారు. తాజాగా నాలుగో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. -
1 నుంచి ఆరు కేజీల బియ్యం
కుటుంబంలో అందరికీ పంపిణీ: మంత్రి ఈటెల హాస్టళ్లకు, మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం కూడా పేదలకు గులాబీ రంగులో రేషన్ కార్డులు.. పాత గులాబీ కార్డుల స్థానంలో తెల్ల కార్డులు కార్డుల జారీ ఆలస్యమైనా సరుకులు అందిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పేదలకు వచ్చే జనవరి 1నుంచి ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున బియ్యం పంపిణీని ప్రారంభిస్తామని ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఆరు కేజీల చొప్పున బియ్యం ఇస్తామని, అలాగే హాస్టళ్లకు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యాన్ని కూ డా 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లాల కలెక్టర్లకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. మంత్రి ఈటెల శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొత్త కార్డులు సరుకులకే పరిమితం: అల్పాదాయ వర్గాలకు గతంలో ఉన్న తెల్ల రేషన్‌కార్డు ల స్థానంలో కొత్తగా గులాబీ రంగు రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ఈటెల తెలిపారు. ఇప్పటివరకూ ఉన్న గులాబీ కార్డుల స్థానంలో తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. కొత్తగా జారీ చేసే గులాబీ రంగు కార్డులు బియ్యం, కిరోసిన్, గోధుమలు, పంచదార, కందిపప్పు వంటి రేషన్ సరుకులకు మాత్రమే పరిమితమని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ తదితర పథకాలకు ఈ కార్డులను పరిగణనలోకి తీసుకోబోరని చెప్పారు. జనవరి నెలాఖరులోగా 99 శాతం రేషన్ కార్డుల పంపిణీని పూర్తి చేస్తామని... కొత్త కార్డులు అందడం ఆలస్యమైనా జనవరి 1వ తేదీ నుంచే బియ్యం పంపిణీ కొనసాగుతుందని ఈటెల వెల్లడించారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో ఉన్న రేషన్‌కార్డుల కన్నా ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. పాఠశాలలు, హాస్టళ్లలో: ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని వసతి గృహాలకు సన్న రకం(బీపీటీ) బియ్యాన్ని జనవరి 1నుంచి పంపిణీ చేయనున్నట్లు ఈటెల తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజ న కార్యక్రమానికి కూడా సన్న బియ్యాన్ని ఈ నెల 2వ తేదీ నుంచి (1న సెలవు మేరకు) పం పిణీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. గ్రా మాల్లో సర్పంచులు, మండలాల్లో ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీల్లో కా ర్పొరేటర్లు, చైర్మన్లు, నగరాల్లో మేయర్లు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కేంద్రాల్లో మంత్రులందరూ ఈ బియ్యం పంపి ణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: సంక్షే మ పథకాలను పూర్తి పారదర్శకంగా అమలుచేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి ఈటెల చెప్పారు. గతంలో కన్నా ఎక్కువ బియ్యం, ఎక్కువ రేషన్‌కార్డులు ఇస్తున్నామని... ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. రేషన్‌కార్డుల సంఖ్యకు అనుగుణంగా గ్రామాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల వారీగా రేషన్ షాపులను పెంచుతామని తెలిపా రు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, పౌర సరఫరాల శాఖ అధికారులు ఉన్నారు. -
11 లక్షల మందికి ‘నో రెన్యువల్’!
34 లక్షల మంది రైతుల్లో... 23 లక్షల మంది రుణాలే రె న్యువల్ ఖరీఫ్ రుణ లక్ష్యం రూ. 14 వేల కోట్లు... ఇచ్చింది రూ. 11 వేల కోట్లు రబీ సీజన్‌కు సంబంధించి కూడా లక్ష్యానికి దూరంగా రుణాల మంజూరు నెలాఖరులోగా ‘రెన్యువల్’ పూర్తి చేసి రుణాలివ్వాలని తెలంగాణ ప్రభుత్వఆదేశం రైతులే ముందుకు రావడం లేదంటున్న బ్యాంకర్లు లక్ష్యాల మేరకు ప్రాధాన్య, అప్రాధాన్య రంగాలకు రుణాలిచ్చామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంకా దాదాపు 11 లక్షల మంది రైతులకు చెందిన పంట రుణాలు రెన్యువల్ కాలేదు. ఖరీఫ్ సీజన్లో మొత్తంగా రూ. 14 వేల కోట్ల మేరకు కొత్త రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా... రూ.11 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇక రబీలో పెట్టుకున్న రుణ మంజూరు లక్ష్యం రూ. 6,300 కోట్లు కాగా... ఇప్పటికీ ఈ రుణ పంపిణీ క్షేత్ర స్థాయిలో ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు. బుధవారం సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ. 4,250 కోట్లను విడుదల చేయడంతో... మొత్తం 34 లక్షల రైతుల రుణాలను రెన్యువల్ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు 23 లక్షల ఖాతాలు మాత్రమే రెన్యువల్ అయ్యాయి. ఖరీఫ్‌లో రైతులకు మొత్తం రూ. 11 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు బ్యాంకర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో మిగతా 11 లక్షల మంది రైతుల రుణాలు రెన్యువల్ చేసి, వెంటనే వారికి కొత్త రుణాలు ఇవ్వాలని మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ బ్యాంకర్లను కోరారు. అయితే వర్షాల్లేక, క్షేత్రస్థాయిలో వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు లేక రైతులు రుణాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని బ్యాంకర్లు ప్రభుత్వానికి వివరించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళిక ప్రకారం ప్రాధాన్య, అప్రాధాన్య రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ప్రాధాన్యతా రంగానికి 40 శాతం రుణాలు ఇవ్వాల్సి ఉంటే.. ఇప్పటికే 33 శాతం మేరకు ఇచ్చినట్లు వివరించారు. కాగా.. రబీ సీజన్లో రూ. 6,300 కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించినా... క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని ప్రభుత్వ అధికారులు బ్యాంకర్ల దృష్టికి తీసుకువచ్చారు. రుణాల రెన్యువల్‌కు సంబంధించి ఎక్కడ ఇబ్బంది ఉందో బ్యాంకులు వివరిస్తే దానిని సరిచేయడానికి వీలవుతుందని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ... ప్రభుత్వం సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తోందని, అందుకు అనుగుణంగా బ్యాంకర్లు రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్వయం ఉపాధి పథకాల కింద ఇచ్చే రుణాలు ఆ కుటుంబాన్ని నిలబెట్టే విధంగా ఉండాలని, అందుకు అవసరమైన సూచనలు, సలహాలను ఇవ్వాలని బ్యాంకులను కోరారు. ఇదివరకే మంజూరైన వారికి ఈ మూడు నెలల కాలంలో రుణాలన్నీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్ రాజీవ్‌శర్మ మాట్లాడుతూ.. పంట రుణాల రెన్యువల్లో కొద్దిరోజులుగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు. ఈ నెలాఖరులోగా దానిని పూర్తి చేయాలని కోరారు. సంతృప్తస్థాయిలో బ్యాంకు ఖాతాలు.. తెలంగాణ రాష్ట్రంలో 97 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఇచ్చామని, ఈ నెల 20వ తేదీ నాటికి అందరికీ ఖాతాలు కల్పించినట్లు ప్రకటించనున్నామని బ్యాంకర్లు సమావేశంలో వెల్లడించారు. జన్ ధన్ యోజన కింద 36 లక్షల ఖాతాలు తెరిపించినట్లు చెప్పారు. వారందరికీ ‘రూపే’ కార్డులను పంపిణీ చేశామని... వారికి రూ. 30 వేల జీవిత బీమా, రూ. లక్ష ప్రమాద బీమా పాలసీ ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలో దాదాపు కోటి బ్యాంకు ఖాతాలున్నట్లు చెప్పారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్, ఎస్బీహెచ్ ఎండీ శంతన్ ముఖర్జీ మాట్లాడుతూ... ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలను అభినందించారు. రాష్ట్రంలో బ్యాంకు శాఖల సంఖ్య 4,682కు చేరిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో రూ. 10,531 కోట్ల డిపాజిట్లు వచ్చాయని, దీనితో మొత్తం డిపాజిట్లు రూ. 2,97,422 కోట్లకు చేరాయని తెలిపారు. దేశంలో రుణ నిష్పత్తి అత్యధికంగా 113 శాతం ఉన్నట్లు తెలిపారు. -
రేపు ఆర్థిక మంత్రుల సమావేశం
న్యూఢిల్లీ: రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం బుధవారం ఢిల్లీలో జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల్ రాజేందర్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈటెల రాజేందర్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.