ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్ | 2 died and 1 injured in road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్

Published Sun, Aug 2 2015 10:14 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

2 died and 1 injured in road accident

నిజామాబాద్ (మాచారెడ్డి) : నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం ఆరేపల్లి వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొట్టింది. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో వినయ్‌కుమార్(23), రాజనర్సు(22) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా..రాజ్ కుమార్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

గాయపడిన రాజ్‌కుమార్ను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరు ముగ్గురూ బైక్‌పై మాచారెడ్డి నుంచి కామారెడ్డి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement