కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కల్తీకల్లు కలకలం రేపింది. రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో ఆదివారం కల్తీకల్లు తాగిన 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని కుటుంబసభ్యులు జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కల్లులో మత్తు కలిగించే రసాయనాలు మోతాదుకు మించి కలపడం వల్లే ఈ సంఘటన జరిగిందని స్థానికలు చెబుతున్నారు.