డిచ్‌పల్లి : వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామ సమీపంలో జాతీయరహదారి-44పై జరిగింది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం సేవలు అందిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
డివైడర్‌ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు
Published Thu, Jun 11 2015 10:11 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement