సివిల్ సప్లై గోదాము నుంచి పక్కదారి పడుతున్న చక్కెర నిల్వలను గుర్తించిన అధికారులు 22 బస్తాల చక్కెరను స్వాధీనం చేసుకున్నారు.
ధర్మపురి: సివిల్ సప్లై గోదాము నుంచి పక్కదారి పడుతున్న చక్కెర నిల్వలను గుర్తించిన అధికారులు 22 బస్తాల చక్కెరను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ధర్మపురిలో గురువారం వెలుగుచూసింది. స్థానిక సివిల్ సప్లై గోదాముల నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న చక్కెర బస్తాలను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.