ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థుల మృత్యువాత | 3 students died in rajanna siricilla district | Sakshi
Sakshi News home page

ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థుల మృత్యువాత

Published Fri, Jun 23 2017 4:03 PM | Last Updated on Fri, Nov 9 2018 4:12 PM

ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థుల మృత్యువాత - Sakshi

ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థుల మృత్యువాత

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది.

కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని పల్లిమక్త గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు కురుకళ్ల మనోహర్‌(13), కురుకళ్ల రాజు(14), ఎనగంటి సంజీవ్‌(16)లు ఈత కోసం చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. వీరు ముగ్గురూ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను వెలికితీయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement