
సిద్దిపేటజోన్: సిద్దిపేటలో ఆదివారం స్థానిక కొత్త బస్టాండ్ ఎదురుగా 25 ఏళ్లుగా ఉన్న రావి చెట్టును నరికిన ఘటనపై మున్సిపల్ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఇందుకు కారణమైన శివకుమారశర్మ అనే వ్యక్తికి రూ.30 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా హరితహారం ప్రత్యేకాధికారి ఐలయ్య మాట్లాడుతూ సిద్దిపేటలో హరితహారం మొక్కలతో పాటు సొంత భూమి, నివాస ప్రదేశాల్లో పెద్దగా పెరిగిన చెట్లను మున్సిపల్ అనుమతి లేకుండా నరికితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అత్యవసర, ప్రమాదకర పరిస్థితుల్లో చెట్లను తొలగించడానికి మున్సిపల్ అనుమతిని తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment