Cutting trees
-
సిద్ధిపేటలో మున్సిపల్, విద్యుత్ శాఖల మధ్య సమన్వయ లోపం
-
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం.. 22 వేల చెట్ల నరికివేతకు హైకోర్టు అనుమతి
ముంబై: మహారాష్ట్రలో చేపడుతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 22 వేల చెట్లను నరికేందుకు బాంబే హైకోర్టు శుక్రవారం అనుమతించింది. ముంబై- అహ్మదాబాద్ మధ్య నడవున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ముంబైతోపాటు పొరుగున్న ఉన్న పాల్ఘర్, థానే జిల్లాల్లో విస్తరించి ఉన్న 22,000 మడ చెట్లను నరికేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్‌కు(ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) అనుమతిస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.. ఈమేరకు చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అభయ్ అహుజాతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే షరతులు వర్తిస్తాయని పేర్కొంది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర తీర మండల నిర్వహణ అథారిటీ మంజూరు చేసిన అనుమతులలో పేర్కొన్న నిబంధనలు, షరతులకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్‌ను హైకోర్టు ఆదేశించింది. కాగా ముంబై, పాల్ఘడ్, థానే జిల్లాల్లోని 50,000కు పైగా మడ చెట్లను నరికివేయడం కోసం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ కోరిన అనుమతిని 2018లో కో-ఆర్డినేట్ బెంచ్ తీరస్కరించింది. ప్రజా ప్రయోజన ప్రాజెక్ట్ కోసం నరికివేత అవసరమైతే అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. దీంతో ఎన్‌ఎచ్‌ఆర్‌ఎస్‌సీఎల్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చదవండి: ఐదేళ్లలో 36 సార్లు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఖర్చు ఎంతో తెలుసా? ప్రాజెక్టు నిర్మాణం కోసం నరికివేయాల్సిన మడ చెట్ల సంఖ్యలను 50,000 నుంచి 20,000 వరకు తగ్గించామని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌ఎస్‌సిఎల్ తరపున న్యాయవాది ప్రహ్లాద్ పరాంజపే కోర్టుకు తెలిపారు. అంతేగాక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్ని అనుమతులు పొందామని.. దీనికి తోడు నరికిన చెట్లకు బదులుగా ఐదు రెట్లు ఎక్కువ మొక్కలు నాటుతామని హామీ ఇచ్చారు. మడ అడవులకు సమీపంలో ఉన్న రెండు ప్లాట్‌ఫారమ్‌లను కొద్దిగా దూరంగా మార్చాలని, దీనివల్ల నరికివేసే మడ చెట్ల సంఖ్య తగ్గుతుందని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర తీర మండల నిర్వహణ అథారిటీ సూచించాయని పేర్కొన్నారు. ఇందుకు ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌ఎస్‌సిఎల్ అంగీకరించిందని, దీంతో చెట్ల సంఖ్య 53,467 నుండి 22,000కి తగ్గిందని తెలిపారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం భారీ సంఖ్యలో చెట్లను నరకడంపై బాంబే ఎన్విరాన్మెంటల్ యాక్షన్ గ్రూప్ అనే ఎన్జీవో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిషేధిత ప్రాంతంలో ఎలాంటి పేలుడు కార్యక్రమాలు చేపట్టకుండా చూడాలని కోర్టును కోరింది. అలాగే చెట్లు నరకడం వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేయలేదని పేర్కొంది. ఈ పిటిషన్‌పై సుధీర్భంగా ఇరు వార్గల వాదనలు విన్న ధర్మాసనం.. డిసెంబర్ 1న రిజర్వ్ చేసిన తీర్పును శుక్రవారం వెల్లడించింది. -
చెట్టును నరికినందుకు రూ.30 వేలు జరిమానా
సిద్దిపేటజోన్: సిద్దిపేటలో ఆదివారం స్థానిక కొత్త బస్టాండ్ ఎదురుగా 25 ఏళ్లుగా ఉన్న రావి చెట్టును నరికిన ఘటనపై మున్సిపల్ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఇందుకు కారణమైన శివకుమారశర్మ అనే వ్యక్తికి రూ.30 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా హరితహారం ప్రత్యేకాధికారి ఐలయ్య మాట్లాడుతూ సిద్దిపేటలో హరితహారం మొక్కలతో పాటు సొంత భూమి, నివాస ప్రదేశాల్లో పెద్దగా పెరిగిన చెట్లను మున్సిపల్ అనుమతి లేకుండా నరికితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అత్యవసర, ప్రమాదకర పరిస్థితుల్లో చెట్లను తొలగించడానికి మున్సిపల్ అనుమతిని తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు. -
300 చెట్లు నేలమట్టం: భారీ జరిమానా
చండీగఢ్: అనుమతించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో చెట్లను నరికివేశాడన్న కారణంగా ఓ కాంట్రాక్టర్‌కు పంజాబ్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. 300 చెట్లను అక్రమంగా నేలమట్టం చేసినందుకు రూ.9 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. వివరాలు.. సిల్వికల్చర్ (కలప ఉత్పత్తికై చెట్ల పెరుగుదల నియంత్రణ)లో భాగంగా మొహాలిలోని మీర్జాపూర్ అడవిలో దాదాపు 6 వేల ఖేర్ చెట్లను నరికేందుకు అటవీ శాఖ అనుతినిచ్చింది.(ఊపిరి పీల్చుకున్న ముంబై) ఈ క్రమంలో కపిల్ శర్మ అనే కాంట్రాక్టర్ చెట్ల నరికివేత కార్యక్రమాన్ని చేపట్టాడు. అయితే అతడు నిబంధనలు ఉల్లంఘించి మరో 300 చెట్లను అధికంగా నరికాడని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పంజాబ్ విజిలెన్స్ బ్యూరో.. ఈ అంశంపై విచారణ చేపట్టింది. అతడు సెక్యూరిటీ డిపాజిట్ కింద జమ చేసిన డబ్బులో నుంచి ఇప్పటికే రూ. 5.72 లక్షలను కట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా రూ. 9లక్షల జరిమానా విధించిన నేపథ్యంలో అతడి నుంచి మరో మూడున్నర లక్షలు త్వరలోనే వసూలు చేయనున్నట్లు వెల్లడించారు.(ఎల్జీ పాలిమర్స్ ఘటన: ఎన్జీటీ తీర్పు) ఇక ఈ విషయంపై స్పందించిన కపిల్ శర్మ.. జరిమానా గురించి తనకేమీ సమాచారం లేదన్నాడు. కార్మికులు పొరబాటున ఈ తప్పు చేసి ఉంటారని.. తను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చాడు. కాగా ప్రతీ ఐదేళ్లకోసారి రెండు ఫీట్ల కంటే ఎక్కువ వ్యాసం కలిగి ఉన్న చెట్లను మాత్రమే నేలమట్టం చేసే ప్రక్రియలో భాగంగా కపిల్ శర్మకు ఈ అవకాశం లభించింది. చెట్లను నేలమట్టం చేసి మార్చి 31 నాటికి కలపను తీసుకువెళ్లాలని అధికారులు అతడికి సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో లాక్డౌన్ విధించిన తర్వాత కూడా ఈ తతంగం కొనసాగినట్లు తెలుస్తోంది. -
చెట్లు నరికినందుకు 45 వేలు ఫైన్
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేటజోన్: సిద్దిపేట పట్టణంలో 4 చెట్లను నరికేసినందుకు అధికారులు రూ.45 వేల జరిమానా విధించారు. పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. అయితే అది అందరికీ స్పష్టంగా కనిపించాలని డివైడర్‌పైన ఉన్న చెట్లను నరికేశారు. చెట్లను నరికిన వారిని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ఐలయ్య సీసీ కెమెరాల సహాయంతో శుక్రవారం గుర్తించారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ఆయన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రకటనల కాంట్రాక్టరుకు రూ.45 వేల జరిమానా విధించారు. -
ఆరే కాలనీలో చెట్లను కూల్చొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: ముంబై మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టు కోసం ఆరే కాలనీలో చెట్ల కూల్చివేత అంశంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చెట్ల కూల్చివేతపై యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది. ముంబైలో పచ్చదనానికి నెలవైన ఆరే కాలనీలో మెట్రో కార్‌షెడ్ ప్రాజెక్టు కోసం పెద్ద సంఖ్యలో చెట్లను నేలకూల్చడంపై న్యాయ విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. ఆరే కాలనీలో ఇప్పటి వరకు జరిగిన చెట్ల కూల్చివేత, ప్రాజెక్టు పనులపై నివేదిక ఇవ్వాలని, నరికివేతకు గురైన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు పెంచాలని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ను ఆదేశించింది. -
హరిత హననం
వేములవాడ : రాష్ట్రాన్ని హరితవనంగా మార్చుదాం.. పచ్చదనంతోనే మానవ మనుగడ.. మొక్కలు సంరక్షిద్దాం.. కాలుష్యాన్ని నివారిద్దామన్న ప్రభుత్వ ప్రచారం ఓ వైపు.. అభివృద్ధి పనులు, జాతర ఏర్పాట్ల కోసం పచ్చని చెట్లను నరికేస్తున్న తీరు మరోవైపు.. హరితహారంలో భాగంగా ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటే, అధికారులు ఇలా చెట్లు నరికివేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే హరిత తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. వేములవాడ పట్టణంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లలో భాగంగా సెస్ అధికారులు చెట్లు నరికేస్తున్నారు. ఏళ్ల తరబడి కంటికిరెప్పలా కాపాడుకున్న చెట్లను కొట్టేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరితహారంలో భాగంగా పట్టణంలో లక్షన్నర మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. దీనికోసం వీధుల్లో రోడ్లకిరువైపులా మొక్కలు నాటారు. హరితహారంలో నాటిన మొక్కలను ఆయా ప్రాంతాల్లోని ప్రజలు సంరక్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మొక్కలను పట్టించుకునే వారు లేక ఎండిపోయాయి. రెండేళ్ల క్రితం నాటిన మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరిగి, పచ్చగా కళకళలాడుతున్నాయి. కానీ వాటిని సెస్ అధికారులు కరెంట్ సరఫరాకు అటంకం కల్గిస్తున్నాయని నరికేస్తున్నారు. శనివారం పట్టణంలోని సినారె కళామందిరం, సెస్ ఆఫీస్‌రోడ్డు, చెక్కపల్లిరోడ్డు, తెలంగాణచౌక్ తదితర ప్రాంతాల్లోని దాదాపు ఇరవైకి పైగా చెట్లను పూర్తిగా నరికివేసేశారు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరికి వేయడానికి అయితే హరితహారం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కరెంట్ తీగలకు అడ్డుగా వచ్చిన కొమ్మలను కొట్టేయాలని, మొత్తం చెట్లను నరికేయడం సరికాదని స్థానికులు పేర్కొంటున్నారు. రెండేళ్లు సంరక్షించా.. సినారె కళామందిరం ముందున్న చెట్లను రెండేళ్లుగా సంరక్షిస్తున్నా. శనివారం మా దుకాణం ఎదుట ఉన్నా చెట్లను నరికి వేశారు. పచ్చని చెట్లు పోయి, మొండెం మిగిలింది. – దేవయ్య, వేములవాడ అధికారులు స్పందించాలి నాటిన మొక్కలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నాం. ఏదో కొంపలు అంటుకుని పోతున్నట్లు ఏపుగా పెరిగిన చెట్లను కొట్టేశారు. నరికేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. – రామారావు, వేములవాడ -
చురుగ్గా ఎన్‌హెచ్ విస్తరణ పనులు
నరసాపురం రూరల్: 216 జాతీయ రహదారి విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ శాఖల నుంచి పూర్తిస్థాయిలో రోడ్డు వివరాలు సేకరించి సర్వే పనులు పూర్తయ్యాయి. ఈ పనులను దక్కించుకున్న టాటా కన్సల్టెన్సీ సిబ్బంది రోడ్డు విస్తరణకు సంబంధించి సర్వే పనులు పూర్తిచేయగా రోడ్డు నిర్మాణానికి సంబందించి అడ్డుగా ఉన్న నిర్మాణాలను, చెట్లను తొలగించే పనులను చించినాడ నుంచి ప్రారంభించి నరసాపురం మండలం వరకు చేపట్టారు. దీనిలో భాగంగా ప్రస్తుతం నరసాపురం మండలం చిట్టవరం, రుస్తుంబాద, సీతారామపురం సౌత్ గ్రామాల్లో జాతీయ రహదారి మార్జిన్‌లోని వృక్షాలను తొలగిస్తున్నారు. జిల్లాలో సుమారు 53 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే రాకపోకలకు మరింత వీలుంటుంది. -
జోరుగా చెట్ల నరికివేత
♦ మితిమీరుతున్న కలప వ్యాపారుల ఆగడాలు ♦ పచ్చదనాన్ని మటుమాయం చేస్తున్న వైనం ♦ కరువు విలయ తాండవం చేస్తున్నా పచ్చని చెట్లను వదలని అక్రమార్కులు ♦ చోద్యం చూస్తున్న అధికారులు మెదక్: కరువు కాటకాల నివారణకు ఏకైక ఆయుధం చెట్లు పెంచడమేనని పాలకులు పదే పదే చెబుతూ హరితహారం పథకం ప్రారంభించారు. కానీ అక్రమ కలప వ్యాపారుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. ఎక్కడ చెట్టు కనిపించినా అక్కడ గబ్బిలంలా వాలిపోయి రైతులకు ఎంతో కొంత ముట్టజెప్పి గంటల వ్యవధిలో నేల కూలుస్తున్నారు. ఓ పక్క కరువు విలయ తాండవం చేస్తున్నా ఊరుకోని వ్యాపారులు ఈ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. చిన్నశంకరంపేట, బొల్లారం, గుమ్మడిదల, చేగుంట, జిన్నారం, బీహెచ్ఈఎల్, పటాన్చెరు ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలకు కలప అవసరం ఉండడంతో జిల్లాలోని చెట్లన్ని ఇబ్బడి ముబ్బడిగా నరికేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఊరూరా కలప వ్యాపారులను తయారు చేసి వారికి కొంత డబ్బులు ఇచ్చి ఈ పచ్చదనంపైకి ఉసిగొల్పుతున్నారు. అసలే కరువు, కాటకాలతో విలవిలలాడుతున్న అన్నదాతలు పైసా సంపాదించే దారిలేక వారిచ్చే ఎంతో కొంత డబ్బులు తీసుకొని పొలం గట్లపైనున్న చెట్లను అమ్ముతున్నారు. దీంతో అక్రమ కలప వ్యాపారులు మామూళ్లతో అధికారుల నోళ్లు మూయించి తమ దందాను మూడు చెట్లు, ఆరు లారీలు అన్న చందంగా కొనసాగిస్తున్నారు. గడిచిన రెండునెలలుగా మెదక్ మండలంలోని ఫరీద్పూర్, జక్కన్నపేట, సర్ధన, ముత్తాయిపల్లి, కూచన్‌పల్లి తదితర గ్రామాల శివారులో నుంచి నిత్యం పదుల సంఖ్యలో కలపను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగమంతా ఫారెస్ట్ అధికారుల కళ్లముందే జరుగుతున్నా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాజాగా మూడు రోజులుగా మెదక్ మండలం ఫరీద్పూర్ గ్రామ శివారులోని చెట్లను నరుకుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఓ వైపు పాలకులు హరితహారం పథకంలో మొక్కలు నాటాలని ప్రచారం చేస్తోంటే అధికారులు మాత్రం దగ్గరుండి అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కలప వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాలవాసులు కోరుతున్నారు. ఈ విషయంపై ఇన్చార్జి ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా విషయం మా దృష్టికి రాలేదు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
కోరలుచాచిన కాలుష్యం
- తీవ్రమైన చెట్ల నరికివేత - నీటి సంరక్షణ, మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం - అడుగంటుతున్న భూగర్భ జలాలు - ‘పర్యావరణం’పై అవగాహనే కీలకం - నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పర్యావరణ పరిరక్షణ.. ఇది అందరి బాధ్యత.. దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలి.. చెట్లు నరకడం వల్ల కలిగే నష్టాలు.. వర్షాలు కురవకపోవడం.. భూగర్భ జలాలు అడుగంటడం.. ఆరోగ్య సమస్యలు తలెత్తడం.. భవిష్యత్ తరాలకు ఎదురయ్యే ఇబ్బందులు.. వీటన్నింటిపై ముందస్తుగా వివరిస్తే కొంత మేలు చేసినట్లవుతుంది.. ఆ దశగా ప్రతి ఒక్కరు అడుగు ముందుకు వేయూలి.. నగరాలు, గ్రామాల్లో మొక్కలు విరివిగా పెంచడం.. వాటిని కాపాడడం బాధ్యతగా తీసుకోవాలి.. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... - వరంగల్ అర్బన్/మహబూబాబాద్ రూరల్ : పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ఏదో ఒక నగరంలో అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది. ఇందులో పర్యావరణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పలు మార్గదర్శక సూత్రాలను రూపొంది స్తుం టారు. 1972లో స్థాపించబడిన ‘ఐక్యరాజ్యసమితి పర్యావరణ పథకం’ ఇదే నివేదికను ఉపయోగించుకుని పర్యావరణానికి సంబంధించి.. రాజకీయవాదులను, ప్రజలను అప్రమత్తం చేసే దిశగా తగిన చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం ఆధునిక పోకడలు పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ప్రజారోగ్యం దెబ్బతినడం వల్ల భవిష్యత్ తరాలకు శాపంగా మారనుంది. పల్లెలు, గ్రామాలను వదిలి పట్టణాలకు, నగరాలకు వలసలు పెరుగుతున్నాయి. ఏటా ఈ శాతం వృద్ధి చెందుతుండటంతో పట్టణాలు, నగరాలపై ఒత్తిడి ఎక్కువవుతోంది. ఆవాసాలకు అవసరమైన స్థలాల కోసం పచ్చని చెట్లను నరికేస్తున్నారు. చెరువులు, కుంటలను ఆక్రమిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. వాహనాల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతుండటంతో కాలుష్య భూతం ప్రజలను భయపెడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో పట్టణాలు, నగరాల్లో జీవనం దుర్భరంగా మారుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాల ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం వెరసి పట్టణాలు, నగరాల్లో పర్యావరణానికి తూట్లు పడుతున్నారు. పర్యావరణంపై పట్టింపు కరువు పర్యావరణం కలుషితం కావడం వల్ల ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపుతున్నాయి. చెత్త చెదారాన్ని ఎక్కడపడితే అక్కడ కాల్చివేస్తుండటంతో వెలువడుతున్న పోగతో శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారు. వాతావరణానికి విఘాతం కలుగుతోంది. పడిపోతున్న భూగర్భ జలాలు నగరంలో అపార్టుమెంట్ సంస్కృతి పెరగడంతో బోరుబావుల నుంచి భూగర్భ జలాల వినియోగం విపరీతంగా పెరిగింది. కాంక్రీట్ జంగిల్లా మారి వర్షపు నీరు భూమిలో ఇంకేం దుకు కూడా ఆవకాశం లేకపోవడం, భూగర్భ జలాలు వినియోగించుకోవడమే కానీ, తిరిగి భర్తీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండటంతో భూగర్భ జల మట్టాలు భారీగా పడిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో హన్మకొండలో 14.38, జనగామలో 13.77 మీటర్లకు భూగర్భ జలమట్టాలు అడుగంటిపోయాయి. ఇలా జిల్లాలోని పట్టణాల్లో, నగరంలో 13 నుంచి 36 మీటర్ల మేర భూగర్భ జలమట్టం అడుగంటిపోరుుంది. కాగితాల్లోనే నిషేధం ప్రభుత్వం 40 మైక్రాన్ల లోపు మందం ఉన్న పాలిథిన్ సంచులను నిషేధించింది. అరుునా నగరంలో పాలిథిన్ వినియోగం ఏమాత్రం తగ్గలేదు. ఎక్కడ చూసినా పాలిథిన్ సంచుల క్రయవిక్రయాల నియంత్రణకు అధికారులు చేపడుతున్న చర్యలు ఏమీ కనిపించడం లేదు. గతంలో పాలిథిన్ విక్రయాలు అరికట్టేందుకు క్రమం తప్పకుండా దాడులు చేసేవారు. అవి నిలిపివేయడంతో పాలిథిన్ సంచుల విక్రయాలు కొనసాగుతున్నాయి. పాలిథిన్ విని యోగం పెరగడం వల్ల వ్యర్థాలతోపాటు టన్నులకొద్దీ పాలిథిన్ చేరుతోంది. దీంతో భూసారం దెబ్బతినడంతోపాటు డ్రైనేజీల్లో చేరినప్పడు మురుగు పారుదలకు ఆటంకంగా తయారవుతున్నాయి. వాల్టా చట్టం అమలులో విఫలం నీరు, భూమి, చెట్టు పరిరక్షణ చట్టం(వాల్టా యాక్టు-2002) అమలులో ఉంది. దీని ప్రకారం వృక్షాలు, చెట్లు నరకకూడదు. ఒకవేళ చెట్లు నరికితే 30 రోజుల్లో ఒక చెట్టుకు రెండు మొక్కల చొప్పన నాటి వాటిని పర్యవేక్షించాల్సి ఉంది. కానీ.. ఇది ఎక్కడ అమలుకు నోచుకోవడం లేదు. ప్రైవేట్ వ్యక్తులే కాదు, విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్నాయని, ఇళ్ల నిర్మాణాలకు, రోడ్ల విస్తరణకు అడ్డుగా వస్తున్నాయని చెట్లను నరికివేస్తున్నారు. నగరంలో విపరీతంగా చెట్లు నరికి వేయడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా ఈ చట్టాలను సక్రమంగా అమలు పరిచే ందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.