ఆరే కాలనీలో చెట్లను కూల్చొద్దు: సుప్రీం | Not stopping construction of Metro shed project in Aarey colony | Sakshi
Sakshi News home page

ఆరే కాలనీలో చెట్లను కూల్చొద్దు: సుప్రీం

Published Tue, Oct 22 2019 3:49 AM | Last Updated on Tue, Oct 22 2019 3:49 AM

Not stopping construction of Metro shed project in Aarey colony - Sakshi

న్యూఢిల్లీ: ముంబై మెట్రో కార్‌ షెడ్‌ ప్రాజెక్టు కోసం ఆరే కాలనీలో చెట్ల కూల్చివేత అంశంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చెట్ల కూల్చివేతపై యథాతథస్థితి (స్టేటస్‌ కో) కొనసాగించాలని ఆదేశించింది.  ముంబైలో పచ్చదనానికి నెలవైన ఆరే కాలనీలో మెట్రో కార్‌షెడ్‌ ప్రాజెక్టు కోసం పెద్ద సంఖ్యలో చెట్లను నేలకూల్చడంపై న్యాయ విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. ఆరే కాలనీలో ఇప్పటి వరకు జరిగిన చెట్ల కూల్చివేత, ప్రాజెక్టు పనులపై నివేదిక ఇవ్వాలని, నరికివేతకు గురైన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు పెంచాలని బృహన్ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ)ను ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement