
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేటజోన్: సిద్దిపేట పట్టణంలో 4 చెట్లను నరికేసినందుకు అధికారులు రూ.45 వేల జరిమానా విధించారు. పట్టణంలోని హైదరాబాద్ రోడ్‌లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. అయితే అది అందరికీ స్పష్టంగా కనిపించాలని డివైడర్‌పైన ఉన్న చెట్లను నరికేశారు. చెట్లను నరికిన వారిని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ఐలయ్య సీసీ కెమెరాల సహాయంతో శుక్రవారం గుర్తించారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ఆయన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రకటనల కాంట్రాక్టరుకు రూ.45 వేల జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment