సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్‌లో కరోనా కలకలం రేగింది. 38 మంది సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణైం ది. గవర్నర్‌కు నెగెటివ్ అని తేలింది. రాజ్‌భవన్‌లో విధులు నిర్వహిస్తున్న 28 మంది స్పెషల్ పోలీసు బెటాలియన్ సిబ్బంది, 10 మంది ఉద్యోగులు, మ రో 10 మంది వారి కుటుంబసభ్యులు కరోనా బారి నపడినట్టు రాజ్‌భవన్ స చివాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రాజ్‌భవన్ పోలీసు సిబ్బందిలో కొందరు కరోనా బారినపడడంతో గవర్నర్ తమిళిసై చొరవ తీసుకుని రెండ్రో జులుగా రాజ్‌భవన్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీ క్షలు చేయించారు. తాను కూడా పరీక్ష చేయించుకున్నారు. 395 మందికి పరీక్షలు నిర్వహించగా, 347 మందికి నెగెటివ్, 48 మందికి పాజిటివ్ వచ్చింది. గవర్నర్‌కు కరోనా సోకలేదని పరీక్షల్లో తేలింది.
కరోనా పరీక్షలకు భయపడొద్దు
కరోనా సోకిన రాజ్‌భవన్ సిబ్బంది, కుటుంబసభ్యులను ఎస్‌ఆర్ నగర్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రికి, 28 మంది పోలీసు సిబ్బందిని ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రానికి పంపించారు. రెడ్‌జోన్లలో నివసిస్తున్న ప్రజలు, కరోనా సోకినవారితో కాంటాక్ట్ ఉన్న వారు తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment