హైదరాబాద్: మెదక్ జిల్లా సిద్దిపేటలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో తోటి విద్యార్థుల ముందు టీచర్ అవమానించారనే మనస్తాపంతో 9వ తరగతికి చెందిన నలుగురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. విద్యార్థులు పాఠశాల ఆవరణలో పురుగుల మందు తాగినట్టు తెలుస్తోంది. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వీరిని హైదరాబాద్ తరలించనున్నారు.
నలుగురు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం
Published Tue, Dec 2 2014 9:42 PM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement
Advertisement