45 రోజులు..రూ.33.09 కోట్లు.. | 45days Rs .33.09 crore | Sakshi
Sakshi News home page

45 రోజులు..రూ.33.09 కోట్లు..

Published Sun, Feb 15 2015 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM

45days Rs .33.09 crore

 ఉట్నూర్ : ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 45 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. కానీ.. ఐటీడీఏ మాత్రం భారీ ప్రణాళికనే రూపొందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గిరిజనాభివృద్ధి కోసం ట్రైకార్ యూక్షన్ ప్లాన్‌లో భాగంగా రూ.33.09 కోట్లతో గిరిజనులకు లబ్ధి చేకూర్చాలని భావిస్తోంది. లక్ష్యం బాగానే ఉన్నా.. సమయం లేక ఆ లక్ష్యం ఎలా సాధ్యపడుతుందో తెలియని పరిస్థితి. ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ట్రైకార్ యూక్షన్ ప్లాన్ రూపొందించి.. ఆయూ పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తే ఇంతోఅంతో ప్రయోజనం చేకూరేది. అర్హులైన వారికి ఆర్థిక ఫలాలు అందే అవకాశం ఉండేది. కానీ.. ఈ తక్కువ రోజుల గడువులో గిరిజనులకు ఎంతవరకు న్యాయం జరుగుతుందో అధికారులకే తెలియూలి మరి..!
 
 రూ.33.09 కోట్లతో ప్రణాళిక..
 జిల్లావ్యాప్తంగా 44 మండలాల్లోని 4,95,794 మంది గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాల్సిన బాధ్యత ఐటీడీఏపై ఉంది. ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా 2014-15 ఆర్థిక సంవత్సరంలో 2,991 యూనిట్ల ద్వారా 2,991 మందికి లబ్ధిచేకూర్చేలా రూ.33 కోట్ల 9 లక్షల 90 వేలతో ఆర్థిక ప్రణాళిక రూపొందించింది. ఇందులో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.5 కోట్ల 59 లక్షల 28 వేలు, కేంద్ర ప్రత్యేక సహాయ నిధి కింద రూ.10 కోట్ల 45 లక్షల 20 వేలు, బ్యాంక్ రుణాల కింద రూ.17 కోట్ల 5 లక్షల 42 వేలుగా నిర్దేశించింది.
 
 ఈ ప్రణాళికతో ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు వ్యవసాయం, చిన్ననీటి పారుదల, పశుసంవర్ధక, స్వయం ఉపాధి కల్పన, స్కిల్ డెవెలప్‌మెంట్ రంగాల్లో అభివృద్ధి సాధించడానికి రుణాలు, యూనిట్లు మంజూరు చేయడంలాంటివి చేయూలి. ఈ ఆర్థిక ప్రణాళిక ప్రభుత్వ ఆమోదం పొందడంతో గిరిజనులకు ఆయా అంశాల్లో రుణాలు నేరుగా బ్యాంకుల ద్వారా మంజూరవుతాయి. అయితే.. ప్రభుత్వం ఐటీడీఏ ట్రైకార్ యాక్షన్ ప్రణాళికను ఆర్థిక సంవత్సరం ముగింపునకు 55 రోజుల ముందు ఆమోదించడంతో లక్ష్యం సాధించడం అనుమానంగా కనిపిస్తోంది. గతంలో ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ట్రైకార్ యాక్షన్ ప్లాన్‌లు తయారు చేసినా.. అమలులో వెనుకబడ్డారు. ఈసారి 45 రోజుల్లో టార్గెట్ పూర్తి చేయడం అనుమానమేనని ఐటీడీఏలోని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
 
 లక్ష్యసాధన అనుమానమే..
 గతంలో ఐటీడీఏ ద్వారా గిరిజనులకు ఆర్థిక ఫలాలు అందాలంటే నేరుగా ఐటీడీఏలో దరఖాస్తులు చేసుకునే వారు. గతేడాది నుంచి ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో ట్రైకార్ యూక్షన్ ప్లాన్‌లో లబ్ధిదారుల ఎంపిక మండల స్థారుు కమిటీల ద్వారా జరుగుతోంది. కమిటీలో ఎంపీడీవో, బ్యాంకు మేనేజర్లు, ఎస్టీ కార్పొరేషన్ అధికారులు, డీఆర్డీఏ అధికారులు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సభ్యులుగా ఉంటారు. వారి సమక్షంలోనే ఎంపికైన లబ్ధిదారులు ఎంపీడీవో కార్యాలయూల్లో సంబంధిత పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తతంగం అంతా పూర్తికాగానే జిల్లాస్థాయి కమిటీలో చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తారు.
 
 తదుపరి ప్రభుత్వం నేరుగా ఆన్‌లైన్ విధానం ద్వారా సబ్సిడీని దరఖాస్తుదారుడి ఖాతాలో జమచేస్తుంది. జిల్లావ్యాప్తంగా ఏజెన్సీ విస్తరించి ఉన్న 44 మండలాల్లో ఈ ప్రక్రియ అంతా 45 రోజుల్లోపే పూర్తికావాల్సి ఉంది. లేదంటే ప్రణాళిక నిధులు మురిగిపోయే ప్రమాదమూ ఉంది. మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజనులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తయూరుచేసుకోవాలంటే నెలల సమయం పడుతుంది. అలాంటి  పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు లోపు లక్ష్య సాధన కష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటికైనా ఐటీడీఏ యంత్రాంగం గిరిజన గ్రామాల్లో ట్రైకార్ యూక్షన్ ప్రణాళికపై విస్త­ృత ప్రచారం నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయూల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే గిరి‘జనాలకు’ ఐటీడీఏ ఫలాలు అందుతాయి.
 2014-15 ట్రైకార్ యాక్షన్ ప్లాన్..
 సెక్టార్    యూనిట్లు    లబ్ధిదారులు    ఓజీఐఏ    ఎస్‌సీఏ    బ్యాంక్ రుణం    మొత్తం విలువ  
             (లక్షల్లో)    (లక్షల్లో)    (లక్షల్లో)    (లక్షల్లో)
 వ్యవసాయం    572    572    60.10    126.00    168.40    354.50     
 చిన్ననీటి     
 పారుదల    628    628    204.18    ---    182.12    386.30
 స్వయంఉపాధి    1,361    1,361    ----    919.20    1166.90    2086.10
 పశుసంవర్ధక    390    390    202.00    ---    188.00    390.00
 స్కిల్‌డెవెలప్‌మెంట్    40    40    93.00    ---    ---    93.00     
 మొత్తం    2991    2991    559.28    1045.20    1705.42    3309.90
 (గమనిక : ఓజీఐఏ : గ్రాంట్ ఇన్ ఎరుుడ్,   ఎస్‌సీఏ : కేంద్ర ప్రత్యేక సహాయ నిధి)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement