సాక్షి, సూర్యాపేట : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెద్ద ఎత్తున పెరగడం రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. గురువారం ఒక్కరోజు జిల్లాల్లో 16 పాజిటివ్ కేసులను వైద్యులు గుర్తించారు. సూర్యాపేట పట్టణంలో 14, మండలాల్లో మరో రెండు కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో జిల్లాల్లో మొత్తం కేసుల సంఖ్య ఒక్కసారిగా 39కి చేరింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. తాజాగా పాజిటివ్ అని తేలిన వారితో దగ్గరగా ఉన్న వారిని గుర్తించి క్వారెంటైన్‌కు పంపేందుకు చర్యలు చేపట్టారు. (రాష్ట్రంలో 8 రెడ్‌జోన్లు)
700కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు కరోనా కారణంగా 18 మంది మృత్యువాత పడ్డారు. కాగా తెలంగాణలో హాట్‌స్పాట్ (రెడ్‌జోన్) జిల్లాలు 8 ఉన్నట్టు కేంద్రం ఇది వరకే ప్రకటించింది. హాట్‌స్పాట్ క్లస్టర్‌గా నల్లగొండ జిల్లా ఉన్నట్టు పేర్కొంది. వైరస్ వ్యాప్తి ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. కేసులు సంఖ్యమాత్రం తగ్గడంలేదు. దీంతో అధికారులు లాక్‌డౌన్ అమలును మరింత కఠినతరం చేస్తున్నారు. మరోవైపు అనుమానితులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment