నిజామాబాద్: వచ్చే జూలైలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల కోసం రూ.750 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ మంజూరు చేశార ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఈ నిధులతో అన్ని పుష్కరఘాట్లలో తగిన వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ మండలం ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఆయన ఆదివారం సతీసమేతంగా హాజరయ్యూరు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని 1,850 దేవాలయాలలో ధూప, దీప నైవేద్యాల కోసం రూ.13 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. అనంతరం ఆలయ ట్రస్టు సభ్యులు, సినీ నిర్మాత దిల్ రాజు, నర్సింహారెడ్డి తదితరులు మంత్రిని సత్కరించారు.
గోదావరి పుష్కరాలకు రూ.750 కోట్లు: ఇంద్రకరణ్
Published Mon, Mar 16 2015 1:22 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement