10 గురుకుల పాఠశాలలు, 2 ప్రత్యేక గురుకులాల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు
ప్రిన్సిపాల్ నుంచి వార్డెన్‌ల వరకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల మంజూరు
రెగ్యులర్ పోస్టులు 657, ఔట్ సోర్సింగ్ పోస్టులు 118
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ప్రారంభ మయ్యే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రిన్సిపాల్ నుంచి వార్డెన్, ఇతర ఔట్ సోర్సింగ్ సేవలను కలుపుకుని 775 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 657 రెగ్యులర్ పోస్టులు కాగా, మరో 118 ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసే పోస్టులు. పోస్టులు, పేస్కేల్ వివరాలను ఉత్తర్వుల్లో పొందుపరిచారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రాబోతున్న 10 గురుకుల పాఠశాలలతో పాటు కరీంనగర్‌లో ఏర్పాటు చేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్, రాయికోట్‌లోని రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్‌లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. కాగా, ఈ గురుకుల పాఠశాలలు సాంఘీక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ నేతృత్వంలో పనిచేస్తాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కొత్తగా ప్రారంభమయ్యే గురుకులాలు:
బెల్లంపల్లి(బి), మానకొండూరు(బి), ఆలంపూర్(బి), చెన్నూరు(జి), వర్ధన్నపేట(బి), దానవాయిగూడెం(జి), కుల్చారం(జి), గోపాలపేట(జి), దోమకొండ(జి), గచ్చిబౌలి(జి)
గురుకుల పోస్టులు: ప్రిన్సిపాల్-10, పీజీటీలు-90, టీజీటీలు-90, పీఈటీ-20, లైబ్రేరియన్-10, స్టాఫ్ నర్స్-10, క్రాఫ్ట్ టీచర్-10, ఆర్ట్/మ్యూజిక్ టీచర్-10, సూపరింటెండెంట్-10, సీనియర్ అసిస్టెంట్-10, వార్డెన్-10.
రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్(జి), రాయ్‌కోట్
పోస్టులు: ప్రిన్సిపాల్ గ్రేడ్ 2-1, ఫిజికల్ డెరైక్టర్ గ్రేడ్ 1-1, పీజీటీలు-5, టీజీటీలు-3, పీఈటీ-1, లైబ్రేరియన్-1, స్టాఫ్ నర్స్-1, సూపరింటెండెంట్-1, సీనియర్ అసిస్టెంట్-1, వార్డెన్-1.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్(సీఈవో), కరీంనగర్
పోస్టులు: ప్రిన్సిపాల్ గ్రేడ్ 1-1, జూనియర్ లెక్చరర్-19, పీజీటీలు-9, టీజీటీలు-1, పీడీ-1, పీఈటీ-1, లైబ్రేరియన్-1, స్టాఫ్ నర్స్-1, సూపరింటెండెంట్-1, సీనియర్ అసిస్టెంట్-1, వార్డెన్-1.
108 అప్‌గ్రేడెడ్ స్కూళ్ల కోసం టీజీటీ పోస్టులు-324.
ఇవి కాక 10 గురుకులాల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించే పోస్టులు: జూనియర్ అసిస్టెంట్/డేటాఎంట్రీ ఆపరేటర్-20, ప్లంబర్ కమ్ ఎలక్ట్రిషియన్-10, రికార్డు అసిస్టెంట్-10, ఆఫీస్ సబార్టినేట్-40.
రాయ్‌కోట్ రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్‌లో జూనియర్ అసిస్టెంట్ మొదలుకుని 13 కేటగిరీల్లో 29 పోస్టులు, కరీంనగర్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్ కోసం 4 కేటగిరీల్లో 9 పోస్టులను మంజూరు చేశారు.
సాంఘిక సంక్షేమ గురుకులాలకు 775 పోస్టులు
Published Fri, Sep 9 2016 1:38 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
Advertisement
Advertisement