వరంగల్ : వరంగల్ జిల్లాలో ఇసుక మాఫియా అగడాలను అడ్డుకునేందుకు జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. అందులోభాగంగా శుక్రవారం ఉదయం వర్థన్నపేట మండల కేంద్రంలోని ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఎనిమిది ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. అనంతరం సదరు ట్రాక్టర్లను పోలీసు స్టేషన్కు తరలించారు.