అరుదైన పాము లభ్యం
హైదరాబాద్: గత నెల జూపార్క్ మసీదు వద్ద దొరికిన అరుదైన "ఎల్లోకాలెడ్ ఉల్ఫ్" స్నేక్ ను బుధవారం జూ అధికారులు జూలో వదిలిపెట్టారు. జూ పార్కు సమీపంలోని ఓ మసీదు ప్రాంతంలో కనిపించిన పామును పట్టుకున్న సిబ్బంది కొద్ది రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి అనంతరం జూ అభయారణ్యంలో వదిలిపెట్టారు. అనపర్తిలో గత ఏప్రెల్ లో ఇలాంటి పాము కనిపించింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే "ఎల్లోకాలెడ్ ఉల్ఫ్" స్నేక్ లు అరుదుగా కనిపిస్తాయని అధికారులు తెలిపారు.