వెయ్యి కోట్ల ప్రభుత్వ స్థలం స్వాధీనం
రక్షణ కంచె, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో రూ.వెయ్యి కోట్ల విలువైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసు కుంది. ఇన్నాళ్లూ వివాదంలో ఉన్న ఈ స్థలాన్ని శని వారం సికింద్రాబాద్ ఆర్డీవో చంద్రకళ నేతృత్వంలో షేక్‌పేట తహసీల్దార్ రాములు సిబ్బందితో కలసి స్వాధీనం చేసుకుని.. చుట్టూ 22 హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి, తెలంగాణ భవన్ మధ్యలో ఉన్న సర్వే నంబర్ 403, టీఎస్ నంబర్ 1, వార్డు 10, బ్లాక్ హెచ్ షేక్‌పేట్ విలేజ్, షేక్‌పేట మండల పరిధిలోని 20 ఎకరాల్లోని ఈ స్థలానికి ఫెన్సింగ్ నిర్మించారు.
రాధికా కో–ఆపరే టివ్ సొసైటీ, గోదావరి కో–ఆపరేటివ్ సొసైటీ, ఫరీద్ హుస్సేన్ అధీనంలో ఉన్న ఈ స్థలం ఇన్నాళ్లూ వివాదంలో ఉంది. 1960లో తాము ఈ స్థలాన్ని అసైనీల ద్వారా కొనుగోలు చేసినట్లు సొసైటీలు చెప్పాయి. 1980లో అప్పటి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌తో ఈ స్థలాలపై విచారణ జరిపి అసైన్ మెంట్ బోగస్ అని తేల్చింది. దీనిపై 1983లో జీవో 942 విడుదల చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ సదరు సొసైటీలు 1984లో హైకోర్టును ఆశ్రయిం చాయి. హైకోర్టు సింగిల్ బెంచ్ జీవోను కొట్టివేస్తూ సొసైటీలకనుకూలంగా తీర్పిచ్చింది.
ప్రభుత్వం మళ్లీ కోర్టును ఆశ్రయించగా నిబంధనలకు అను కూలంగా ఉండి.. అర్హత ఉంటే సొసైటీలకు రెగ్యు లరైజ్ చేయడానికి దరఖాస్తును పరిశీలించాల్సిం దిగా తీర్పునిచ్చింది. సొసైటీలకు రెగ్యులరైజేషన్‌కు అర్హత లేదంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర యించింది. 2002లో చంద్రబాబు ప్రభుత్వం, ఆ తర్వాత రోశయ్య ప్రభుత్వం ఈ స్థలంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినా.. సమస్య పరి ష్కారం కాలేదు. దీంతో ఈ నెల 6న రాష్ట్ర ప్రభు త్వం ఈ సొసైటీల రెగ్యులరైజేషన్ దరఖాస్తులను తిరస్కరిస్తూ ఆర్డర్ పాస్ చేసింది.