సాక్షి, మహబూబ్‌నగర్ : ఆధార్‌కార్డు కోసం వచ్చే వారి నుంచి పైసలు వసూలు చేసే మీసేవ సెంటర్లపై కొరడా ఝుళిపించాలని జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మీసేవ సూపరింటెండెంట్ బక్క శ్రీనివాస్‌ను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆధార్‌కార్డు కోసం వెళ్లే లబ్ధిదారుల నుంచి ప్రైవేట్ మీసేవ కేంద్రాలు డబ్బు వసూళ్లను వివరిస్తూ ‘సాక్షి’ వెలువరించిన ‘‘పైసలిస్తేనే ఆధార్’’ అనే కథనం పట్ల కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు. అక్రమాలను సహించేది లేదని స్పష్టం చేశారు.
మరీ ముఖ్యంగా పారదర్శకత కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆధార్ కార్డుల విషయంలో కూడా అక్రమాలకు పాల్పడడం క్షమించరానిదన్నారు. కనుక ఇదివరకు ఉన్న ఫిర్యాదులపైనే, మున్ముందు వచ్చే వాటి పట్ల కూడా సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో ఆధార్ కోసం అనుమతించిన అన్ని మండలాల మీ సేవ కేంద్రాలపై ఎమ్మార్వోలు విచారణ చేపట్టాలని సూచించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆధార్ పై.. విచారణ
Published Wed, Mar 11 2015 1:32 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement