
బాసర: నిర్మల్ జిల్లా బాసర ఆలయంలో ఏడేళ్ల కాలంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక ప్రకారం ఆలయంలో ఈవోలుగా పనిచేసిన ఆరుగురికి మెమోలు జారీ చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆదేశించడంతో అధికారులు మెమోలు జారీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. వీరితోపాటు ఆలయంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సెక్షన్ అధికారులు కూడా బాధ్యులుగా తేలితే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవోకు ఆదేశాలు ఇవ్వడంతో ఆలయాధికారులు వారి వివరాలను సేకరిస్తున్నారు.
రూ.100 కోట్లకు పైగా అవినీతి, అక్రమాలు జరగడంతో ఏసీబీ అధికారులు బాసర ఆలయంపై దృష్టి సారించారు. శనివారం ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బృందం సభ్యులు ఆలయ ప్రత్యేకాధికారి అన్నాడి సుధాకర్‌రెడ్డిని కలిసి వివరాలు సేకరించారు. ఆలయ సూపరింటెండెంట్ల బ్యాంకు లావాదేవీల వివరాలను పరిశీలించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment