ప్రముఖ నటుడు పీజే శర్మ మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు పీజే శర్మ మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శర్మ కుమారుడు సాయికుమార్‌ను జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఫోన్‌లో పరామర్శించారు. సాయికుమార్ తండ్రి మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేసి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.