‘ఆధారం’ లేదు..‘ఆసరా’ లేదు!
* పుట్టుకతోనే చేతులు లేని చిన్నారి
* చేతివేళ్లు లేనందున ఆధార్ ఇవ్వలేమంటున్న సిబ్బంది
* సీఎం జిల్లాలోనే చిన్నారి దీనదుస్థితి
నర్సాపూర్: ఈ చిన్నారి పేరు భూలక్ష్మి, వయసు నాలుగేళ్లు. తల్లిదండ్రులు మొగులయ్య, లక్ష్మి. స్వగ్రామం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని అహ్మద్‌నగర్. పుట్టుకతోనే రెండు చేతు లూ లేవు. మొగులయ్య తన కూతురు భూలక్ష్మి కి వికలాంగులకిచ్చే పింఛన్ కోసం ఏడాది నుంచీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. వికలాంగులకిచ్చే పింఛన్ రావాలంటే ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని, అప్పుడే పింఛన్ మంజూ రు చేయిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పా రు. దీంతో మొగులయ్య సదరం క్యాంపు ఏర్పా టు చేసినప్పుడల్లా కూతురిని తీసుకువెళ్లి వికల త్వ పరీక్షలు చేయమంటూ అధికారుల కాళ్లావేళ్లా పడుతున్నాడు. అయితే ఆధార్ లేనిదే ధ్రువీకర ణ పత్రం ఇవ్వలేమని అక్కడివారు చెబుతున్నారు.
దీంతో ఆయన ఆధార్ సెంటర్‌కు పలుమా ర్లు తీసుకువెళ్లినా వివరాల నమోదుకు సిబ్బంది అంగీకరించడం లేదు. చేతి వేళ్లు లేనందున తాము ఆధార్ నమోదు చేయలేమని చెబుతున్నా రు. ఈ కారణంతోనే రేషన్‌కార్డులో కూడా భూ లక్ష్మి పేరు నమోదు కాలేదు. శుక్రవారం నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన సదరం క్యాంపునకు భూలక్ష్మిని మళ్లీ తీసుకువెళ్లాడు. అక్కడా చేదు అనుభవమే ఎదురైంది. ఈ సమయంలోనే అక్క డి వచ్చిన జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణిని కలిసి మొగులయ్య తన గోడును వెళ్లబోసుకున్నాడు. అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూ స్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలోని ఈ చిన్నారికి ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుందో వేచి చూడాలి మరి.