ఆధార్‌ లేదని పెన్షన్‌ జాప్యం సరికాదు: సీఐసీ | Pension delay is not correct as there is no aadhar | Sakshi
Sakshi News home page

ఆధార్‌ లేదని పెన్షన్‌ జాప్యం సరికాదు: సీఐసీ

Published Wed, Apr 11 2018 1:49 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM

Pension delay is not correct as there is no aadhar - Sakshi

న్యూఢిల్లీ: ఆధార్‌ కార్డును అనుసంధానం చేయలేదన్న కారణంతో వృద్ధులకు పెన్షన్‌ చెల్లింపులో జాప్యం చేయవద్దని కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ) మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. తనకు గత మార్చి నుంచి పెన్షన్‌ ఎందుకు చెల్లించడం లేదో తెలపాల్సిందిగా అహ్మద్‌నగర్‌కు చెందిన నిర్మలా నిషికాంత్‌ దుమానే కేంద్ర సమాచార కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. అనంతరం దీనిపై మరోసారి దాఖలు చేసిన పిటిషన్‌లో ఆధార్‌ కార్డును కచ్చితంగా అనుసంధానం చేయాలన్న ఉత్తర్వులను పంపాల్సిందిగా ఆమె డిమాండ్‌ చేశారు.

ఈ పిటిషన్లను పరిశీలించిన కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు.. ఆధార్‌ కార్డు లింక్‌ చేయలేదన్న కారణంగా వృద్ధులు, రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌ చెల్లింపులో ఏ ప్రభుత్వ సంస్థ కూడా జాప్యం చేయరాదని వెల్లడించారు.  కాగా, ఆధార్‌ కార్డు అనుసంధానం చేయలేదన్న కారణంగా నెలవారీ పెన్షన్‌ చెల్లింపును నిలిపివేయవద్దని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) బ్యాంకులు, పోస్టాఫీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement