అప్పుల బాధతో భర్త చచ్చినా ఆదుకోరా?
ప్రజావాణిలో బాధితురాలు జంగమ్మ ఆవేదన
వికారాబాద్ టౌన్ : ఈమె పేరు జంగమ్మ. ఊరు వికారాబాద్ జిల్లా పులుసుమామిడి. భర్త పేరు కావలి మల్లేశ్. ఈయన పంట పెట్టుబడులు, ఇతర అవసరాల నిమిత్తం సుమారు రూ.6.85 లక్షలు అప్పు చేశాడు. ఈ క్రమంలో తన రెండెకరాల పొలం, ఇంటిని విక్రరుుంచగా వచ్చిన మొత్తాన్ని అప్పులకు జమ చేశాడు. ఇంకా రూ. 3 లక్షలు పైగానే అప్పులు ఉండడంతో తీర్చేందుకు మరో మార్గం లేక 2015 ఆగస్టులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరుుతే ఈ విషయం తెలుసుకున్న అప్పటి వికారాబాద్ సబ్ కలెక్టర్ అలగు వర్షిణి, తహశీల్దార్ గౌతమ్‌కుమార్ ఆ గ్రామాన్ని సందర్శించి విచారించారు.
కాగా.. గ్రామస్తులు పలువురు.. ఆత్మహత్యకు పాల్పడ్డ రైతుకు పొలమే లేదని అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో వారు వెనుతిరిగారు. అప్పటి నుంచి జంగమ్మ, గ్రామ ఎంపీటీసీ సభ్యుడు మల్లేశ్ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా ఫలితం లేకుండాపోరుుంది. దీంతో సోమవారం వికారాబాద్‌లో నిర్వహించిన ప్రజావాణిలో విన్నవించేందుకు జంగమ్మ మరోసారి వచ్చింది. అరుుతే జేసీ సురేష్ పొద్దార్.. మృతుడికి భూమి లేనందున ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధికి అర్హత లేదని తెలిపారు. దీంతో జంగమ్మ.. ప్రభుత్వం తనను ఆదుకోకపోతే నేను, నా పిల్లలు చావడం తప్ప మరో మార్గం లేదని సబ్‌కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో విలపించడం అంద రినీ కలచివేసింది.