
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి
అశ్వాపురం: కోర్టుల పేరుతో కాలయాపన చేయకుండా అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం పక్రియను వేగవంతం చేసి ఖాతాదారులకు డబ్బులు చెల్లించాలనే డిమాండ్‌తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని అగ్రిగోల్డ్ బాధితులు బుధవారం ఇక్కడ ఒక రోజు దీక్ష, ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు నాగారాపు నాగరాజు, సాధు అర్జున్‌లు మాట్లాడుతూ బాధితులకు డబ్బు చెల్లింపుల విషయంలో కాలయాపన చేయడం వల్ల ఇప్పటివరకు 103 మంది ఏజెంట్లు, కస్టమర్లు ఆత్మహత్య చేసుకున్నారని, లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు.
దీక్షలో కట్ల సతీష్, చందర్‌రావు, భూక్యా నాగేశ్వరరావు, రమేష్, గోపి, సాంబ, రామనర్సయ్య, శోభ, తిరుపతమ్మ, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, బాధితులు పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకుడు వై.వి.పురుషోత్తం ర్యాలీలో పాల్గొని దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అశ్వాపురం సర్పంచ్ బాణోత్ శారద, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్, మాలమహానాడు నాయకులు కాలువ సంసోన్, మేకల భాస్కర్‌లు సంఘీభావం ప్రకటించారు.