
యువత లక్ష్యంతో ముందుకెళ్లాలి.
సింగరేణి ప్రాజెక్టుఅండ్‌ప్లానింగ్ డెరైక్టర్ మనోహర్‌రావు
యైటింక్లయిన్‌కాలనీ : యువత తపన, పట్టుదలతో ముందుకెళ్లాలని సింగరేణి ప్రాజెక్టుఅండ్ ప్లానింగ్ డెరైక్టర్ మనోహర్‌రావు అన్నారు. స్థానిక అబ్దుల్‌కలాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థుల తో బుధవారం మాట్లాడారు. పక్కా ప్రణాళికలను రచించుకుని, వాటి అమలుకు ముందుకు సాగాలన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణకోసం యాజమాన్యం సహాయసహకారాలు అందిస్తుందన్నారు. ప్రస్తుతం యువత విజయానికి అడుగుదూరంలో ఉందని, సంకల్పంతో చేరుకోవాలని ఆకాంక్షించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో సింగరేణి సంస్థ తనవంతు కృషి చేస్తోందన్నారు.
కోల్‌బెల్ట్ ప్రాంత యువతకు ఉద్యోగావశాలు కల్పించేందుకు సంస్థ సీఅండ్‌ఎండీ శ్రీధర్ ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా సింగరేణి ఆణిముత్యాల కార్యక్రమం నిర్వహించి 11వేల మంది యవతకు వివిద సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న 142 మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొంది సింగరేణి సంస్థకు త మ చేయూతనందించాలని పేర్కొన్నారు. హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ అందిస్తున్న శిక్షణను అభినందించారు.
పోలీసుశాఖ లో ఉద్యోగాలు పొంది సింగరేణి సంస్థకు సహాయ సహాకారాలు అందించాలన్నారు. ఆర్జీ-2 జీఎం విజయపాల్‌రెడ్డి, ఎస్‌ఓటూ జీఎం రవీందర్, ఏజీఎం రాజేష్, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, రాజారెడ్డి, యూనియన్ నాయకులు ఐలి శ్రీనివాస్, దశరధం తదితరులు పాల్గొన్నారు.