కామారెడ్డి : దేశ సరిహద్దులు దాటిన ఫెన్సిడిల్ సిరప్ అక్రమ దందా విషయంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చేపట్టిన విచారణ కొలిక్కి వస్తోంది. దగ్గుమందు అక్రమ దందాలో కీలక పాత్ర పోషించినవారికి సంబంధించి ఆధారాలను సేకరించిన అధికారులు చర్యలు మొదలుపెట్టారు. బిల్లుల ఆధారంగా విచారణ జరిపిన అనంతరం మంగళవారం కామారెడ్డికి చెందిన అజంతా ఏజెన్సీస్ లెసైన్సును రద్దు చేశా రు. దీంతో దుకాణం మూతపడింది. అజంతా యజమాని పాత సుధాకర్ ఫెన్సిడిల్ అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించినట్టు ఇప్పటికే అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.
దేశ సరిహద్దులు దాటిన దగ్గుమందు అక్రమదందా విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చి వరుస కథనాలను ప్రచురించింది. ఆ తరువాత అజంతా ఏజెన్సీ నుంచి 2.39 లక్షల ఫెన్సిడిల్ సిరప్ బాటిళ్లు అక్రమ రవాణా అయినట్టు గుర్తించిన అధికారులు వాటి బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్‌కు రవాణా అ యిన ఫెన్సిడిల్ సీసాల సంగతి అటుంచితే తమ ఏజెన్సీకి వచ్చిన మందులను రిటైలర్ దుకాణాలకు సరఫరా చేసినట్టు అజంతా ఏజెన్సీ యజమానులు బిల్లులు తయారు చేశారు.
అక్రమదందా వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత ఔషధ నియంత్రణ శాఖ విచారణను వేగవంతం చేసింది. మెడికల్ షాప్‌ల యజమానులను పిలిపించి వివరాలను ఆరా తీసింది. తాము అజంతా నుంచి వాటిని తెప్పించలేదని, ఆ బిల్లులకు, తమకు ఏ సంబంధమూ లేదని వారు స్పష్టం చేసినట్టు సమాచారం. మెడికల్ షాపుల యజమానులను నేరుగా నిజామాబాద్ కార్యాలయానికి పిలిపించి విచారణ జరుపుతున్నారు. లిఖితపూర్వకంగా వివరాలను రాయించుకుంటున్నారు. వాటిని కోర్టుకు సమర్పిస్తే నిందితుల చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశం ఉంది.
నాలుగు జిల్లాలలో విచారణ
బిల్లులలో నాలుగు జిల్లాలకు చెందిన మెడికల్ షాప్‌ల వివరాలు ఉండడం తో ఆయా జిల్లాల అధికారులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. త్రిపురలో భద్రతా దళాలకు చిక్కిన తరువాత కేసును టేకప్ చేసిన అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రావడంతో విచారణను వేగవంతం చే శారు. అక్రమదందాలో భాగస్వాములైన వ్యాపారులు కేసు నుంచి తప్పించుకునేం దుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
‘అజంతా’కు చెక్...
Published Thu, Dec 11 2014 3:44 AM | Last Updated on Fri, May 25 2018 2:47 PM
Advertisement
Advertisement