ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది స్థానాలకు గాను తొలి రోజు ఆర్మూర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకుల లలిత ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం రిటర్నింగ్ అధికారులను ఇప్పటికే నియమించింది. ఈనెల 19 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన 20న ఉంటుంది. ఉప సంహరణకు ఈనెల 21 వరకు గడువుంది. బరిలో నిలిచే అభ్యర్థులెవరో 21న పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది. అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షల వరకు పరిమితి ఉంది.
సాక్షి,నిజామాబాద్: ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో తొలి ఘాట్టానికి అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. సోమవారం ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఎన్నికల షెడ్యుల్‌ను అధికారికంగా విడుదల చేశారు. నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. తొలి రోజు ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది స్థానాలకు గాను ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. ఆర్మూర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకుల లలిత నామినేషన్ దాఖలు చేశారు. ఆర్మూర్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులుకు ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని అందజేశారు. మిగిలిన చోట్ల నామినేషన్లుదాఖలు కాలేవు. ఈనెల 19 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు. నామినేషన్ల పరిశీలన 20న ఉంటుంది. ఉప సంహరణకు ఈనెల 21 వరకు గడువుంది. బరిలో నిలిచే అభ్యర్థులెవరో 21న పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది. డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాలను డిసెం బర్ 11న ప్రకటిస్తారు. 19 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం తొమ్మిది నియోజవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను ఇప్పటికే నియమించింది. ఈ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు.
అభ్యర్థుల ఖర్చుపై ప్రత్యేక నిఘా..
ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చుపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందుకో సం జిల్లాకు ఇద్దరు ఐఆర్‌ఎస్ ఉన్నతాధికా రులను అభ్యర్థుల వ్యయ పరిశీలకులుగా నియమించారు. ఆర్మూర్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల వ్యయ పరిశీలకు లుగా 2002 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అ ధికారి జి.నంతకుమార్ నియమితులయ్యారు. 2005 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి షేక్ శంషేర్ అలం నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బా ల్కొండ నియోజక వర్గాల వ్యయ పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. ఈ ఇద్దరు ఉన్నతాధికారులు సోమవారం జిల్లాకు చే రుకున్నారు. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావుతో సమావేశమయ్యారు.
ఈ ఎన్నిక ల్లో అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షల పరిమి తి ఉంది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై ఈ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగనుంది. అభ్యర్థులు ఎన్నికల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరవడం, ఈ ఖాతాల ద్వారానే ఖర్చు చేయడం, ఏ వస్తువులకు ఎంత ఖర్చు చేసేది, ర్యాలీలు, సభలు, వాహనాలు, రవాణా, ఫ్లెక్సీల ఖర్చు, స మావేశాలకు అయ్యే ఖర్చుల వివరాలపై నిఘా పెట్టనున్నారు. నేర చరిత్ర ఉన్న అ భ్యర్థులకు సంబంధించి అత్యధిక సర్క్యు లేషన్ కలిగిన వార్తా పత్రికలు, టీవి ఛానళ్ల లో ప్రకటించాల్సి ఉంటుందని, ఈ ప్రకట న ఖర్చును కూడా అభ్యర్థుల వ్యయంలో లెక్కించడం జరుగుతుందని అభ్యర్థులకు తెలిపామని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నా రు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడి ఖర్చులు చేసుకోవాల్సిందిగా సూచించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment