వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘అంబిటస్’
సిద్దిపేట అర్బన్: సిద్దిపేటలోని అంబిటస్ పాఠశాల యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం రాజ్యాంగం ప్రవేశిక, హక్కులు మొదలైన అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించింది. ఒకేసారి 545 మంది విద్యార్థులచే రాజ్యాంగం ఆమోదించిన సంవత్సరం 1949 ఆకారంలో నిలబెట్టి రాజ్యాంగ ప్రవేశికను మూడుసార్లు చూడకుండా చదివించి రికార్డు సాధించింది. ఈ ఘనతను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నమోదు చేసినట్లు ఆ సంస్థ భారతదేశ ప్రతిని«ధి బింగి నరేందర్‌గౌడ్ తెలిపారు. రాజ్యాంగ ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని పాఠశాల కరస్పాండెంట్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అనంతరం సంస్థ ప్రతినిధులు విద్యార్థులు సృష్టిం చిన రికార్డును ప్రకటించి ప్రిన్సిపాల్ ఎడ్ల జ్యోతికి అందించారు.