
ఆగస్టులో అమిత్‌షా పర్యటన
హైదరాబాద్: బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆగస్టులో తెలంగాణలో పర్యటించేందుకు అంగీకరించటంతో పార్టీ తెలంగాణ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే పార్టీ బలంగా ఉందని అమిత్‌షా అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఆయన శ్రేణులకు మార్గ నిర్దేశనం చేయనున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మంగళవారం రాత్రి ఏర్పాటైన పదాధికారుల సమావేశంలో వెల్లడించారు.
సమావేశానికి ఎంపీ దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, సీనియర్ నేతలు విద్యాసాగరరావు, నాగం జనార్దన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. అమిత్‌షా ఆగస్టు 21, 22 తేదీల్లో పర్యటించే అవకాశం ఉందని, అధికారికంగా ఇంతా తేదీలు ఖరారు కాలేదని కిషన్‌రెడ్డి సమావేశం దృష్టికి తెచ్చారు. తెలంగాణకు ఎయిమ్స్ తరహా ఆసుపత్రి మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించటం పట్ల కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.