కేసీఆర్‌ గెలవాలని నాలుక కోసుకున్నాడు | Andhra Young Man Who Has Cut Tongue For KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కోసం నాలుక కోసుకున్న ఆంధ్రా యువకుడు

Published Wed, Dec 5 2018 7:13 PM | Last Updated on Thu, Dec 6 2018 2:32 AM

 Andhra Young Man Who Has Cut  Tongue For KCR - Sakshi

సాక్షి, హైదరబాద్ ‌: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం గూటాల గ్రామానికి చెందిన మహేశ్‌ చేవెళ్ల (34) అనే రైతు నాలుకలో కొంత భాగాన్ని కోసుకున్నాడు. ఘటన హైదరాబాద్‌ శ్రీనగర్‌కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం చోటుచేసుకుంది. అనంతరం నాలు క భాగాన్ని ఆలయ హుండీలో వేశాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నాలుక భాగం తెగిపడటంతో రక్తం పెద్ద ఎత్తున కారింది.

సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని హుండీలో ఉన్న నాలుక భాగాన్ని తీసి, బాధితుడిని సమీపంలోని తన్వీర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మహే శ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. చికిత్స కొనసాగుతోందని రెండు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. బంజారాహిల్స్‌ ఎస్‌ఐ పి.డి.నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మహేశ్‌ తన స్వగ్రామం నుంచి హైదరాబాద్‌ చేరుకొని లాడ్జిలో బస చేశాడు. బుధవారం మధ్యాహ్నం గుడికి వచ్చి కేసీఆర్‌ సీఎం కావాలని నినాదాలు చేస్తూ నాలుక కోసుకున్నాడు. 2004, 2009లో కూడా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఇదే గుడిలో మహేశ్‌ నాలుక కోసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 2019లో ఆంధ్రప్రదేశ్‌కు జగన్‌ సీఎం కావాలని ఓ లేఖ కూడా రాసి జేబులో పెట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement