
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం మరో 52 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 33, విదేశాల (కువైట్) నుంచి వచ్చిన వారు నలుగురుకాగా, మరో 15 మంది మ హారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలు ఉన్నారు. మొత్తంగా ఇప్పటివరకు కేసుల సంఖ్య 1,813కు చేరింది. శనివారం ఒకరు చనిపోయారు. దీంతో మృతుల సం ఖ్య 49కి చేరుకుంది. తాజాగా 25 మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటివరకు 1,068 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం గాంధీలో 696 మం ది చికిత్స పొందుతున్నారు.
మొత్తం నమోదైన కేసు ల్లో ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారు 59 శాతం కాగా మరణించినవారు మూడు శాతం మంది ఉన్నారని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు కరోనా బులెటిన్‌లో పేర్కొన్నారు. కాగా, వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వారు ఎక్కువగా కరోనాబారిన పడుతున్నారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాకు చెందినవారు 35 మంది ఉండగా జగిత్యాల జిల్లా– 30 మంది, మంచిర్యా ల జిల్లా– 23, నల్లగొండ–7, మహబూబాబాద్–5, జనగాం–5, సిరిసిల్ల–4, నిజామాబాద్–3, నిర్మల్, ఖమ్మం, కరీంనగర్‌లలో రెండేసి, భూపాలపల్లిలో ఒక కేసు నమోదైందని డా.శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment