ఢిల్లీలో బీజేపీ నేతల వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఈ ఏడాది రైతులు పెద్ద ఎత్తున పత్తి సాగుచేసిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచేందుకు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అంగీ కరించారని తెలంగాణ బీజేపీ నేతలు తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, పార్టీ సమ న్వయకర్త బాలరాజ్ తదితరులు శుక్రవారం స్మృతీ ఇరానీతో సమావేశమై పత్తి కొనుగోలు కేంద్రాలు పెంచాలని కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఈ ఏడాది అదనంగా 54 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలకు హామీ ఇచ్చారు. అలాగే కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ను కలసి హైదరాబాద్‌లోని అటవీ పరిశోధన సంస్థ సేవలను మరింతగా వినియోగించుకునేం దుకు అధిక నిధులు కేటాయించాలని కోరారు. ఈ సంద ర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జీఎస్టీ విషయంలో పూటకోమాట మాట్లాడుతోందని విమర్శించారు.